ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ‘బాహుబలి’ తరహాలోనే ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు అటు మేకర్స్, ఇటు ప్రేక్షకులు. ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్‌ను ఇంకా పెంచడానికి గట్టిగా ప్రమోషన్లు చేస్తోంది రాజమౌళి అండ్ టీం.
ఐతే ప్రమోషన్లలో ఈ సినిమా గురించి ఇస్తున్న ఎలివేషన్ అంతా బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో రాజమౌళి చేసిన బాక్సాఫీస్ అద్భుతం ‘బాహుబలి’ని తగ్గించేస్తున్నారన్న అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఫోకస్ ఉండాలనో ఏమో.. స్వయంగా రాజమౌళే ‘బాహుబలి’ గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా మాట దాటవేస్తున్నాడు. చిత్ర బృందంలో కూడా ఎవ్వరూ ‘బాహుబలి’ గురించి మాట్లాడకుండా ఆయన జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది.
పైగా ‘ఆర్ఆర్ఆర్’.. ‘బాహుబలి’ని మించిన సినిమా అంటున్నాడు. నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎక్కడా ఎవ్వరూ ‘బాహుబలి’ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. తారక్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ ప్రాంతీయ అడ్డుగోడల్ని బద్దలు కొడుతుందని, భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతుందని అన్నాడు. కానీ ఈ పని ‘బాహుబలి’ ఎప్పుడో చేసిందన్న విషయం మరిచిపోకూడదు. అసలు రాజమౌళి అనే పేరు ప్రపంచానికి బాగా తెలిసింది, ఆయన ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నది ‘బాహుబలి’ సినిమాతోనే.
ఆ చిత్రం ప్రేక్షకులకు ఒక ఎమోషన్. తెలుగు రాష్ట్రాల అవతల కూడా ప్రేక్షకులను మన ఆడియన్స్ స్థాయిలోనే ఉద్రేకానికి, ఉద్వేగానికి గురి చేసి వాళ్లను ఉర్రూతలూగించిన సినిమా అది. ఐతే ‘బాహుబలి’ కేవలం ప్రమోషన్లతో జనాలకు చేరువ కాలేదు. నాన్ తెలుగు ఆడియన్స్ ఓపెన్ మైండ్‌తో ఈ సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఆ సినిమాను అమితంగా ప్రేమించారు. ‘ది బిగినింగ్’ తర్వాత ‘ది కంక్లూజన్’ కోసం విపరీతమైన ఆసక్తితో ఎదురు చూశారు. ఆ యుఫోరియా అన్నది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంకే సినిమాకు కూడా పునరావృతం కాకపోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ కూడా అందుకు మినహాయింపు కాదనే చెప్పాలి. జనాలు ‘బాహుబలి’తో పోల్చుకోకూడదని జక్కన్న భావిస్తున్నాడో ఏమో కానీ.. తాను సృష్టించిన అద్భుతాన్ని తానే తగ్గించే ప్రయత్నం చేస్తుండటం ఆ సినిమాను అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు మింగుడు పడటం లేదు.
This post was last modified on March 21, 2022 8:09 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…