Movie News

ల‌క్ష్యం-2 వ‌స్తోంది

ల‌క్ష్యం.. గోపీచంద్ కెరీర్లో ఒక‌ప్పుడు బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా. ద‌ర్శ‌కుడు శ్రీవాస్‌కు ఇదే తొలి సినిమా కావ‌డం విశేషం. గోపీచంద్‌, జ‌గ‌ప‌తిబాబు, అనుష్క ముఖ్య పాత్ర‌ల్లో ర‌స‌వ‌త్త‌రంగా ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ను తీర్చిదిద్ది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలిచాడు శ్రీవాస్. ఆ త‌ర్వాత అత‌డి కెరీర్లో మ‌ళ్లీ గోపీచంద్‌తోనే తీసిన లౌక్యం మిన‌హా స‌క్సెస్ లేదు.

చివ‌ర‌గా సాక్ష్యం సినిమాతో ఎదురు దెబ్బ తిన్న శ్రీవాస్.. చాలా గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ త‌నకు అచ్చొచ్చిన గోపీచంద్‌తోనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బేన‌ర్ మీద టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఈ చిత్రానికి టైటిల్ ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. 

త‌మ క‌ల‌యిక‌లో వ‌చ్చిన తొలి సినిమా పేరు క‌లిసొచ్చేలా ల‌క్ష్యం-2 అనే పేరును ఈ చిత్రానికి ఖ‌రారు చేశార‌ట గోపీ, శ్రీవాస్. ఇప్ప‌టిదాకా అయితే ఈ సినిమా ల‌క్ష్యంకు సీక్వెల్ అన్న హింట్లేమీ రాలేదు. మ‌రి ఊరికే పేరు క‌లిసొస్తుంద‌ని ల‌క్ష్యం-2 అని పెట్టారా లేక ఆ క‌థ‌నే కొన‌సాగిస్తున్నారా అన్న‌ది తెలియ‌దు.

గోపీచంద్ న‌టిస్తున్న 30వ సినిమా ఇది కావడం, అత‌డితో పాటు శ్రీవాస్‌కూ ఈ సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా అవ‌స‌రం కావ‌డంతో బాగా క‌స‌ర‌త్తు చేసే రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. క్లాస్ సినిమాల‌కు పెట్టింది పేరైన మిక్కీ జే మేయ‌ర్ ఈ మాస్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌టం విశేషం. ఇటీవ‌లే ఖిలాడి సినిమాలో త‌న గ్లామ‌ర్‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన తెలుగ‌మ్మాయి డింపుల్ హ‌య‌తి ఈ చిత్రంలో ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో మ‌రో క‌థానాయిక‌కీ చోటున్న‌ట్లు స‌మాచారం.

This post was last modified on March 20, 2022 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

5 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

6 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

8 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

10 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

11 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

11 hours ago