ఈ హెడ్డింగ్ చూసి.. మళ్లీ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఇంకో సినిమా తీయబోతున్నాడా.. లేక ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలగొచ్చు. కానీ అసలు సంగతి వేరు. ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయ్యాక.. ఇంకొన్ని రోజులకు ఇంకో ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేయబోతున్నాడట జక్కన్న.
అది వేరే కథ కాదు. ఇంకో సినిమా కాదు. మనం ఈ వారం వెండితెరపై చూడబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమానే.. కొన్ని రోజులకు వేరే నటీనటులతో బుల్లితెరపై చూపిస్తాడట జక్కన్న. ఇదేం చిత్రం అనిపిస్తోందా? ఇది ఆర్ఆర్ఆర్ కోసం పని చేసిన రాజమౌళి అసిస్టెంట్లు చేయబోతున్న మాయ.
ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో దీని గురించి వెల్లడించాడు రాజమౌళి. తాను ఏ సినిమా చేసినా.. అసలు నటీనటులు చేయడానికి ముందు ప్రతి సన్నివేశాన్నీ అసిస్టెంట్ డైరెక్టర్లతో రిహార్సల్స్ చేయడం అలవాటు అని.. అలా ప్రతి సన్నివేశాన్నీ ముందే ట్రయల్ షూట్ చేస్తామని.. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ ఇదే జరిగిందని.. తన అసిస్టెంట్లు ప్రతి సన్నివేశాన్నీ నటించి చూపించారని అన్నారు.
ఇక అదంతా షూట్ చేశామని, అంతే కాక ఎడిటింగ్ కూడా చేసి పెట్టామని.. మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా అంతా తన అసిస్టెంట్ల వెర్షన్లో చూడొచ్చని.. అసలు సినిమా రిలీజయ్యాక కొన్ని రోజులకు ఈ వెర్షన్‌ను కూడా అందరు ప్రేక్షకులకూ చూపిస్తామని.. ఇది ఒక నవ్వుల విందు అవుతుందని జక్కన్న చెప్పాడు. ఎప్పుడూ తన సినిమాల వేడుకల్లో అసిస్టెంట్ల గురించి చెప్పడానికి అవకాశం రాదని, టైమైపోతోందని వారి గురించి చెప్పనని.. కానీ ఈ రోజు మాత్రం వాళ్లందరి గురించి చెప్పాల్సిందే, మీరు భరించాల్సిందే అంటూ జక్కన్న తన 10 మంది అసిస్టెంట్ల గురించి ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు.
This post was last modified on March 20, 2022 10:12 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…