గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్ మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్‌ను తట్టుకుని తొలి వారాంతం వరకు, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత నిలబడలేకపోయింది.
వీకెండ్ తర్వాత వసూళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. రెండో వీకెండ్లో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల అవతల సినిమా రన్ ఆల్రెడీ ముగిసినట్లే కనిపిస్తోంది. దర్శకుడిగా ఒక్క సినిమా అనుభవమే ఉన్నప్పటికీ ప్రభాస్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం దక్కితే దాన్ని ఉపయోగించుకోలేకపోయాడని రాధాకృష్ణ కుమార్ మీద విమర్శలు వస్తున్నాయి. ఐతే రాధాకృష్ణ మాత్రం తాను మంచి సినిమానే తీశానని, సినిమాను అర్థం చేసుకున్న ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారని అంటున్నాడు.
అదే సమయంలో తన చిత్రానికి విమర్శలు కూడా తక్కువగా ఏమీ రాలేదని అతనన్నాడు. రాధేశ్యామ్ విడుదల తర్వాత ప్రభాస్ స్పందనను సైతం అతను పంచుకున్నాడు. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్‌ను నేరుగా కలిసే అవకాశం లేకపోయిందని, అతను విదేశాలకు వెళ్లాడని, ఐతే ఫోన్లో మెసేజ్‌ల ద్వారా తామిద్దరం టచ్‌లో ఉన్నామని రాధాకృష్ణ వెల్లడించాడు.
సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందన గురించి స్పందిస్తూ.. రిలీజ్ తర్వాత తొలి మూడు రోజులు తన ఇమేజ్.. సినిమాను డామినేట్ చేస్తుందని ప్రభాస్ వ్యాఖ్యానించినట్లు రాధాకృష్ణ తెలిపాడు.
ప్రేక్షకుల్లో కొందరు తమ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుంటే.. అదే సమయంలో విమర్శలు కూడా వస్తున్న మాట నిజమే అని.. ఐతే ఈ నెగెటివిటీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని, కానీ రోజులు గడిచేకొద్దీ సినిమాకు జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారని.. చాలా ఎమోషనల్‌గా మెసేజ్‌లు పెడుతున్నారని రాధాకృష్ణ తెలిపాడు. తన భార్య ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్‌గా స్పందించిందని, సినిమాకు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ తన నుంచే అని రాధాకృష్ణ చెప్పాడు.
This post was last modified on March 20, 2022 8:22 am
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…