Movie News

ఐదేళ్ల నిరీక్షణ ఫలిస్తుందా?

దర్శకుడు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అనుకోకుండా హీరోగా మారి, తొలి సినిమా ‘ఉయ్యాల జంపాల’తో సూపర్ హిట్ కొట్టి.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించిన కుర్రాడు రాజ్ తరుణ్. కెరీర్ ఆరంభంలో అతడి ఊపు చూసి మంచి స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు.

అనిల్ సుంకర లాంటి పెద్ద నిర్మాత అతడితో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వరుసగా మూడు సినిమాలు నిర్మించడం విశేషం. ఇంత డిమాండ్లో ఉన్న హీరో కాస్తా.. అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన స్థితికి చేరుకున్నాడు. హ్యాట్రిక్ హిట్ల తర్వాత ఇన్నేళ్ల కెరీర్లో అతడికి దక్కిన ఓ మోస్తరు విజయం అంటే.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే. అది కూడా సూపర్ సక్సెస్ అని చెప్పలేం కానీ.. ఉన్నంతలో బాగానే ఆడింది. 2017లో వచ్చిన ఆ చిత్రమే రాజ్‌కు చివరి విజయం.

ఆ తర్వాత ఐదేళ్లలో పది సినిమాల దాకా చేశాడు. కానీ ఏదీ సరైన ఫలితాన్నివ్వలేదు.మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఇండస్ట్రీ నుంచి అంతర్దానం అయిపోతున్న స్థితిలో రాజ్ నటించిన కొత్త చిత్రం.. స్టాండప్ రాహుల్. ఇప్పటిదాకా ఒక మూసలో సినిమాలు చేసుకుంటూ పోయిన రాజ్.. ఈసారి స్టాండప్ కమెడియన్‌గా ట్రెండీగా ఉండే పాత్రలో నటించాడీ చిత్రంలో. టైటిల్, క్యారెక్టర్ సహా అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. దీని ట్రైలర్ కూడా ఆకర్షణీయంగానే కనిపించింది. కానీ రాజ్ ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేయడం వల్ల ఈ సినిమాకు పెద్దగా హైప్ అయితే లేదు.

అందులోనూ రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాల మధ్యలో పడటం ప్లస్సో మైనస్సో తెలియని పరిస్థితి నెలకొంది. వేరే సినిమాల పోటీ లేకపోవడం ప్లస్ అయితే.. ఆ భారీ చిత్రాల సందడిలో దీని పట్ల జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది చెప్పలేని పరిస్థితి. సినిమాకు ఎంత మంచి టాక్ వస్తుందన్నది కీలకం. మరి శుక్రవారం థియేటర్లలోకి దిగుతున్న ‘స్టాండప్ రాహుల్’ గురించి మధ్యాహ్నానికి జనం ఏం మాట్లాడుకుంటారో చూడాలి.

This post was last modified on March 18, 2022 10:41 am

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

2 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

9 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

9 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

10 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

12 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

12 hours ago