ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ట్యాగ్ ‘బాహుబలి’ నుంచి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చేసింది. ‘బాహుబలి’తో తాను నెలకొల్పిన అన్ని రికార్డులనూ బద్దలు కొట్టడానికి రాజమౌళి సిద్ధమైనట్లే కనిపిస్తున్నాడు. ఇప్పటికే బడ్జెట్, బిజినెస్, రిలీజ్ రేంజ్ పరంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ను ‘ఆర్ఆర్ఆర్’ మించేసింది. రూ.550 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కినట్లు చెబుతుండగా.. బిజినెస్ రూ.890 కోట్లకు జరిగిందని స్వయంగా రాజమౌళే వెల్లడించాడు.
ఇక ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ని మించి, ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కాని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయబోతున్నారు. రికార్డు స్థాయి స్క్రీన్లలో, అత్యధిక షోలు పడబోతున్నాయి. ‘బాహుబలి-2’ రోజులతో పోలిస్తే టికెట్ల ధరలూ పెరిగాయి. కాబట్టి ఓపెనింగ్స్‌లో ‘బాహుబలి-2’ను ‘ఆర్ఆర్ఆర్’ కొట్టడం లాంఛనమే కావచ్చు.
మరి ఫుల్ రన్లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది, ‘బాహుబలి-2’ను దాటుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేం.ఐతే ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ మరో విషయంలోనూ పై స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. రన్ టైం పరంగా దీనిదే పైచేయి. బాహుబలి: ది బిగినింగ్ నిడివి 2 గంటల 38 నిమిషాలు కాగా.. ‘ది కంక్లూజన్’ రన్ టైం 2.51 గంటలు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ ఫైనల్ కంట్ 3 గంటల 6 నిమిషాలని వెల్లడైంది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ రోజుల్లో 3 గంటలకు పైగా నిడివితో సినిమా అంటే అరుదనే చెప్పాలి.
గత కొన్నేళ్లలో తెలుగులో 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన సినిమాలు అర్జున్ రెడ్డి, రంగస్థలం మాత్రమే అని చెప్పాలి. అంత నిడివి ఉన్నా అవి ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సాగిపోయాయి. ఘన విజయాలందుకున్నాయి. రాజమౌళి సినిమా అంటే బోర్ కొట్టడానికి స్కోపే ఉండదు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రోమోలు చూస్తే ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగే సినిమాలాగే కనిపిస్తోంది. కాబట్టి 3 గంటల పై నిడివి అనేది సమస్య కాదనే భావించాలి. మరింత ఎక్కువ వినోదాన్నిచ్చి టికెట్ డబ్బులకు ఎక్కువ న్యాయమే చేస్తాడేమో జక్కన్న అని ఆశిద్దాం.
This post was last modified on March 18, 2022 9:59 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…