Movie News

ఆర్ఆర్ఆర్ ఇర‌గ‌దీస్తే.. జ‌క్క‌న్న డ్యాన్స్

సరిగ్గా ఇంకో వారం.. బాక్సాఫీస్ షేక్ అవడం ఏంటో తెలిసే రోజు రాబోతోంది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25నే థియేటర్లలోకి దిగబోతోంది. ‘బాహుబలి’ మ్యాజిక్‌ను రాజమౌళి సహా ఇంకెవ్వరూ రిపీట్ చేయలేరని అంతా అనుకున్నారు కానీ.. తన తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’తో ఆ మ్యాజిక్‌ను జక్కన్న పునరావృతం చేయగలడనే అనిపిస్తోంది ఈ చిత్రం చుట్టూ నెలకొన్న యుఫోరియా చూస్తుంటే.

స్వయంగా రాజమౌళే.. ఇది ‘బాహుబలి’ని మించిన సినిమా అంటుండటం చూస్తే.. 25న బాక్సాఫీస్ ఊచకోత చూడబోతున్నట్లే కనిపిస్తోంది. మరి అంచనాలకు తగ్గట్లు సినిమా ఉండి.. ‘బాహుబలి’కి దీటుగా ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల మోత మోగిస్తే.. చిత్ర బృందం ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటుందన్నది ఆసక్తికరం. మిగతా వాళ్ల సంగతేమో కానీ.. జక్కన్న మాత్రం కొంచెం వెరైటీగానే ‘ఆర్ఆర్ఆర్’ విజయోత్సాహాన్ని చూపించబోతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నాటు నాటు పాట, అందులో ఇద్దరు హీరోలు వేసిన స్టెప్పులు ఎంత పాపులరయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరూ ఒకరి భుజం ఒకరు పట్టుకుని ఒక సింక్‌లో చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేసింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాజమౌళి అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే.. స్వయంగా ఆయనే ఈ స్టెప్ వేసి చూపించబోతున్నాడట. ఈ మేరకు ‘ఆర్ఆర్ఆర్’ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్‌కు జక్కన్న హామీ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ టీం దర్శకుడు అనిల్ రావిపూడితో చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో జక్కన్న ఈ ప్రామిస్ చేశాడు.

ట్రూత్ అండ్ డేర్ టైపులో జరిగిన ఒక సెగ్మెంట్లో.. జక్కన్న సినిమా నుంచి ఒక సీక్రెట్‌ను బయట పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. అలా చేయని పక్షంలో అనిల్ ఇచ్చే ఒక టాస్క్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ హుక్ స్టెప్ చేయమని అనిల్ అడిగాడు. దానికాయన కుర్చీలో కూర్చునే ఈ స్టెప్ ట్రై చేశాడు. ఐతే ఇది సరిపోదని.. లేచి నిలబడి డ్యాన్స్ చేయాలని అనగా జక్కన్న చేయలేదు. ఆ తర్వాత తారక్ అందుకుని ఈ సినిమా తాము అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే.. అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ రాజమౌళి అందరి ముందూ ఈ స్టెప్ వేయాలని డిమాండ్ చేశాడు. ఇందుకు జక్కన్న ఓకే చెప్పాడు. ఈలోపు ఆ స్టెప్ ప్రాక్టీస్ చేసి.. ఆర్ఆర్ఆర్ సక్సెస్ మీట్లో భాగంగా ఈ స్టెప్ వేస్తానని హామీ ఇచ్చాడు.

This post was last modified on March 17, 2022 12:19 pm

Share

Recent Posts

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

10 minutes ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

27 minutes ago

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

5 hours ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

6 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

10 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

11 hours ago