ఇంకో వారం రోజులే మిగిలుంది ఆర్ఆర్ఆర్ విడుదలకు. ఈ చిత్రంపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చాలా ఆలస్యమైనా, విడుదల పలుమార్లు వాయిదా పడ్డ హైప్‌కేమీ తక్కువ లేదు. రిలీజ్ ముంగిట ఆ హైప్‌ను మరింత పెంచడానికి చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రమోషన్లు పునఃప్రారంభించి దూకుడు మీదున్నారు రాజమౌళి, తారక్, చరణ్. ఈ ముగ్గురూ కలిసి దేశమంతా తిరిగేస్తున్నారు.
ఇక ప్రమోషన్ల పరంగా పీక్స్ ఈ నెల 19న చూడబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజే ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్. ఇందుకోసం ఆసక్తికర వేదికను ఎంచుకున్నారు. రాయలసీమ వాసులకు దగ్గరగా ఉండే కర్ణాటక ప్రాంతం చిక్‌బళ్లాపూర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ వేడుకకు వచ్చే అతిథుల గురించి కూడా ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
చరణ్ తరఫున అతడి తండ్రి, మెగాస్టార్ చిరంజీవి.. తారక్ తరఫున అతడి బాబాయి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆర్ఆర్ఆర్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథులుగా వస్తారంటున్నారు. ఐతే వీళ్లు అతిథులు మాత్రమేనట. ముఖ్య అతిథి చాలా పెద్ద స్థాయి వ్యక్తిగా చెబుతున్నారు. ఆయనెవరో కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. ఒక సీఎం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడం అరుదైన విషయమే.
అందులోనూ తెలుగు హీరోల్ని పెట్టి ఒక దర్శకుడు తీసిన పాన్ ఇండియా మూవీకి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ గెస్ట్‌గా వస్తే ఆ కళే వేరుగా ఉంటుంది. ఆయనతో పాటు కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన శివరాజ్ కుమార్ సైతం ఈ వేడుకకు హాజరవుతారంటున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి ఇదొక్కటే ప్రి రిలీజ్ ఈవెంట్ ఉంటుందా.. హైదరాబాద్‌లో మరో వేడుక ఏదైనా ప్లాన్ చేస్తారా అన్నది తెలియడం లేదు.
This post was last modified on March 17, 2022 12:29 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…