బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమాకు ముందుగా బడ్జెట్ రూ.50 కోట్లకు అటు ఇటుగా అనుకున్నారు. బాహుబలి-1 మేకింగ్ దశలో ఉండగానే ఈ సినిమా ఓకే అయింది. అప్పటికి ప్రభాస్‌కు ఉన్న మార్కెట్‌కు అనుగుణంగానే ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం పట్టాలెక్కేసరికి ప్రభాస్ ఇమేజ్, మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయాయి. దీంతో బడ్జెట్ అంతకంతకూ పెంచుకుంటూ పోయి రూ.300 కోట్లు చేసేశారు.
రాధేశ్యామ్ బడ్జెట్ కూడా ఇలా పెరిగిందే. ఐతే ఒక స్క్రిప్టు ఓకే అయినపుడే దానికి ఎంత ఖర్చు పెట్టాలన్నది కూడా నిర్ణయం అయిపోతుంది. బడ్జెట్ పెంచుకునే వెసులుబాటుంటే అది కొంత వరకే. కానీ ఇలా ఖర్చు ఐదారు రెట్లు అయిపోవడం మాత్రం ప్రభాస్ సినిమాల్లోనే చూశాం. ఐతే నిజంగా అవసరం అయి అంత ఖర్చు పెట్టారా అంటే అలా అనిపించదు. ప్రభాస్ మార్కెట్ పెరిగింది, ఇమేజ్ మారింది కాబట్టి.. భారీతనం ఉండాలని అవసరానికి మించి ఖర్చు చేశారనిపిస్తుందే తప్ప మరో భావన కలగదు సాహో సినిమా చూసినా, రాధేశ్యామ్ చూసినా.
అవసరానికి మించి ఖర్చు పెట్టడం వల్ల టెక్నికల్‌గా ఉన్నతంగా అనిపించాయే తప్ప సినిమాల స్థాయి ఏమీ పెరగలేదు. నిజానికి ఈ భారీతనం వల్ల కొంత అసహజత్వం వచ్చిన మాట కూడా వాస్తవం. అసలు సినిమాకు కీలకమైన కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకుండా ఎంత ఖర్చు పెట్టి, ఎన్ని హంగులు జోడించి ఏం ప్రయోజనం? అయినా ప్రభాస్ సినిమా అంటే భారీతనం ఉంటేనే చూస్తారన్న భ్రమల్లో ఎందుకున్నారన్నది అర్థం కాని విషయం.
అతణ్ని మామూలు కథల్లో, ఒక సామాన్యుడిలా చూడలేమా అన్నది ప్రశ్న. సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో అతణ్నో అసామాన్యుడిగా చూపించడం వల్ల ఒరిగిందేమిటి? కాబట్టి అవసరం లేని భారీతనం, హంగులు, బడ్జెట్ మీద ఫోకస్ పక్కకు మళ్లించి మామూలు కథల్లో, ఓ మోస్తరు బడ్జెట్లలో సినిమా చేసి అందరినీ సంతోషపెట్టడానికి ప్రభాస్ ప్రయత్నిస్తే మంచిది.
This post was last modified on March 17, 2022 12:31 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…