యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో ఇటీవలే దస్ కా దమ్కీ అనే సినిమా అనౌన్స్ కావడం తెలిసిందే. గత ఏడాది విశ్వక్ నుంచి వచ్చిన పాగల్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన నరేష్ కుప్పిలినే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. పాగల్ సినిమా ఫ్లాపైనా నరేష్‌కు విశ్వక్సేన్ ఇంకో ఛాన్స్ ఇవ్వడం గురించి అంతా మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. బుధవారం ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.
కానీ ఈ రోజు మెగా ఫోన్ పట్టుకున్నది మాత్రం నరేష్ కాదు. స్వయంగా విశ్వక్సేనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వారం రోజుల ముందు అనౌన్స్‌మెంట్ సందర్భంగా నరేష్ కుప్పిలిని దర్శకుడిగా ప్రకటించి.. ఇప్పుడేమో విశ్వకే ఆ బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతలో ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. అసలీ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసిందెవరు.. ఇన్నాళ్లూ దాన్ని డీల్ చేసిందెవరు.. ఇప్పుడు ఇంత మార్పు ఎలా జరిగింది అన్నది తెలియడం లేదు.
ఐతే విశ్వక్‌కు దర్శకత్వం అయితే కొత్త కాదు. అతను ఇంతకుముందే ఫలక్‌నుమా దాస్ అనే సినిమా తీశాడు. ఐతే అది మలయాళ క్లాసిక్ అంగామలై డైరీస్‌కు రీమేక్. దాన్ని హైదరాబాద్ నేపథ్యంలో విశ్వక్ బాగానే తీశాడు. బాక్సాఫీస్ దగ్గర దానికి ఓ మోస్తరు ఫలితం దక్కింది.
మరి ఈసారి కూడా వేరే భాషా చిత్రాన్నేమైనా రీమేక్ చేస్తున్నాడా.. లేక సొంత కథతోనే సినిమా తీస్తున్నాడా అన్నది చూడాలి. అసలే తొలి సినిమా ఫ్లాప్. పైగా ఇప్పుడు రెండో సినిమాకు దర్శకుడిగా ప్రకటించి.. తీరా షూటింగ్ మొదలయ్యే టైంకి తప్పించడం అన్నది నరేష్ కెరీర్‌కు ఇబ్బందికరమే. మరి ఈ మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో తన కొత్త చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం రిలీజ్ టైంలో మీడియాను కలిసినపుడు విశ్వక్ చెప్పక తప్పదేమో.
This post was last modified on March 17, 2022 12:23 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…