ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న సినిమా అంటే.. ఆర్ఆర్ఆర్‌యే. పలుమార్లు వాయిదా పడి జనవరి 7న విడుదలకు అంతా సిద్ధమైన తరుణంలో ఈ చిత్రం మరోసారి పోస్ట్ పోన్ అయింది. అప్పుడు నెల రోజుల పాటు ఎంతో కష్టపడి గట్టిగా ప్రమోషన్లు చేసిన చిత్ర బృందం.. వాయిదతో నిరాశకు గురైంది. ఐతే అనివార్య పరిస్థితుల్లో అది తప్పలేదు. ఇప్పుడు మార్చి 25న మాత్రం సినిమా పక్కాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
దీంతో మరోసారి ప్రమోషన్ల జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగానే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి హిందీ కమెడియన్ భువన్ బామ్‌తో స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలోకి వచ్చింది. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చాలా సరదాగా సాగిపోయిందీ వీడియో. జక్కన్న, చరణ్, తారక్ ముగ్గరూ మంచి జోష్‌తో కనిపించారిందులో.
ముఖ్యంగా తారక్ అయితే తనదైన శైలిలో అల్లరి చేశాడు. ఒక చోట అతను అడిగిన ప్రశ్నకు భువన్ బామ్‌కు దిమ్మదిరిగిపోయింది. ఈ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఎలా ఉందని బామ్ అడిగితే.. మా సంగతి వదిలేయ్, ఇంతకీ జానీ సిన్స్‌తో నీ ఇంటర్వ్యూ ఎలా సాగింది అని అడిగాడు తారక్. జానీ సిన్స్ పెద్ద పోర్న్ స్టార్. పోర్న్ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్లకు అతణ్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అతడిని ఓసారి భువన్ బామ్ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు. అది వైరల్ అయింది. దాని గురించి తారక్ గుర్తు చేసి, కొంటెగా ప్రశ్న అడిగాడు. భువన్ దీనికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక బిక్కమొహం వేశాడు. తర్వాత ఇంటర్వ్యూ బాగానే సాగిందని చెప్పాడు. ఇలా అప్‌డేట్‌గా ఉండేవాళ్లంటే తనకు ఇష్టమంటూ తారక్‌ను చూసి నవ్వాడు.
This post was last modified on March 16, 2022 6:34 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…