తొలి సినిమా మిర్చితోనే అగ్ర దర్శకుల జాబితాలో
చేరిపోయాడు కొరటాల శివ. అతను ఇప్పటిదాకా తీసింది నాలుగు సినిమాలే. ఆ
నాలుగూ బ్లాక్‌బస్టర్లే. దర్శకుడిగా కొరటాలకు ఇది ఏడో సంవత్సరం.
ఆయన ఇంకా చాలా ఏళ్లు దర్శకుడిగా కొనసాగుతాడని.. మరెన్నో సినిమాలు
తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
కానీ ఆయన మాత్రం ఇంకో
ఐదేళ్లకు మించి తాను సినిమాలు తీయనంటున్నాడు. ప్రస్తుతం కమిటై ఉన్న
సినిమాలన్నీ పూర్తి చేసి ఐదేళ్లలో రిటైరవ్వాలనుకుంటున్నట్లు కొరటాల
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఆ సమయానికి యువ ప్రతిభావంతులు
వచ్చి తన స్థానాన్నీ భర్తీ చేస్తారని ఆయన చెప్పాడు.
మరి
రిటైర్మెంట్ తీసుకుని కొరటాల ఏం చేస్తాడు అంటే.. సమాజ సేవ అంటున్నాడు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉన్న కొరటాల..
ఆత్మపరిశీలన చేసుకుంటున్నట్లు చెప్పాడు. సమాజానికి ఏం చేయాలనే ఆలోచన
చేస్తున్నట్లు వెల్లడించాడు. కొరటాలలో సామాజిక స్పృహ ఎక్కువన్నది
అతడి మాటలు, చేతల్ని బట్టి తెలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే తన
సంపాదనలో కొంత భాగం సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు.
సొసైటీ
కోసమని పిల్లలు కూడా వద్దనుకున్న గొప్ప మనిషి కొరటాల. దీని గురించి
గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ
విషయాన్ని ప్రస్తావించాడు. అంటే ఇప్పుడు సినిమాల ద్వారా
సంపాదిస్తున్నదంతా కూడా భవిష్యత్తులో సమాజం కోసమే
వెచ్చించబోతున్నాడన్నమాట కొరటాల. సొసైటీ కోసం పిల్లల్ని
వద్దనుకుని.. బ్రహ్మాండమైన కెరీర్‌ను కూడా వదులుకుని సామాజిక సేవలో
నిమగ్నమవ్వాలనుకుంటున్నాడంటే కొరటాల గొప్పోడేనబ్బా!
This post was last modified on April 17, 2020 5:50 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…