రాజమౌళి రాయబారం ఫలించినట్లే ఉంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’కు జగన్ సర్కారు బహుమతి ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ చిత్రానికి ఏపీలో అదనంగా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. టికెట్ మీద రూ.100 అదనంగా పెంచుకోవడానికి జగన్ సర్కారు పచ్చజెండా ఊపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐతే ఐదో షోకు కూడా అనుమతి ఇవ్వాలని, అదనపు షోగా చిన్న సినిమాను ప్రదర్శించాలనే మెలిక తీసేయాలని, తమ సినిమానే రోజుకు ఐదు ఆటలు నడిపించుకునే సౌలభ్యం కల్పించాలని రాజమౌళి కోరగా.. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బెనిఫిట్ షోల కోసం కూడా అడగ్గా.. దాని గురించీ క్లారిటీ రావాల్సి ఉంది. టికెట్ల రేట్ల పెంపు వరకు అయితే ఇబ్బంది ఏమీ లేదని సమాచారం. గత ఏడాది అనూహ్యంగా తగ్గించి పడేసిన టికెట్ల రేట్లను ఇటీవలే జగన్ సర్కారు పెంచుతూ జీవో ఇవ్వడం తెలిసిందే.
భారీ చిత్రాలకు కొన్ని షరతుల ప్రకారం దీని మీద అదనంగా రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉంటుందని కూడా అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే పారితోషకాలు కాకుండా మేకింగ్ ఖర్చు రూ.100 కోట్లు ఉండి, 20 శాతం షూటింగ్ ఏపీలో జరిగితేనే ఇది వర్తిస్తుందని పేర్కొంది. కానీ బడ్జెట్ పరంగా రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ ఈ కేటగిరిలోకి వచ్చినా.. 20 శాతం షూటింగ్ ఏపీలో చేసుకోకపోవడం మైనస్ అయింది.
ఐతే ఈ జీవో తెచ్చింది ఇప్పుడే కాబట్టి ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలకు ఇది ఎలా వర్తింపజేస్తారన్న ప్రశ్న తలెత్తింది. ముందు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ రెంటికీ రేట్ల పెంపు ఉంటుందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నప్పటికీ.. ‘రాధేశ్యామ్’కు అవకాశం దక్కలేదు. అందుకు కారణాలేంటో తెలియదు. ఐతే రాజమౌళి, దానయ్య మాత్రం తమ సినిమాకు లాభం చేకూర్చడం కోసం నేరుగా ఏపీ సీఎంను కలిసి విన్నవించుకుని వచ్చారు. దీంతో జగన్ వరం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on March 15, 2022 6:03 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…