Movie News

టాలీవుడ్‌పై బాలీవుడ్ ప్రతీకారం

గత డిసెంబరులో హిందీలో ‘83’ సినిమా విడుదలైంది. పేరున్న తారాగణం, పెద్ద డైరెక్టర్.. ఆకర్షణీయమైన కథాంశం.. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలకు వారం ముందే అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’ను హిందీలో కూడా రిలీజ్ చేశారు. దీనికి పెద్దగా ప్రమోషన్లు లేవు. రిలీజ్ విషయంలోనూ చాలా హడావుడి అయింది. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజైన ‘పుష్ప’.. ఏమాత్రం ప్రభావం చూపుతుందో అని అంతా సందేహించారు. పైగా తర్వాతి వారమే ‘83’ రిలీజవుతుండటంతో బన్నీ సినిమా అడ్రస్ లేకుండా పోతుందనుకున్నారు. కానీ జరిగింది వేరు.

‘పుష్ప’కు అనూహ్యమైన స్పందన వచ్చింది ప్రేక్షకుల నుంచి. అంతకంతకూ కలెక్షన్లు పెరుగుతూ పోయాయి ఈ సినిమాకు. దీని దెబ్బకు ‘83’ లాంటి భారీ చిత్రం అడ్రస్ లేకుండా పోయింది చివరికి. తొలి వీకెండ్లో ఓ మోస్తరు ప్రభావం చూపించిన ఈ సినిమా.. ఆ తర్వాత చల్లబడిపోయింది. మల్టీప్లెక్సుల వరకే కాస్త నిలబడింది. మాస్ సెంటర్లలో ‘పుష్ప’ తిరుగులేని ఆధిపత్యం చలాయించింది.

పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ లాంటి అనువాద చిత్రం దెబ్బకు.. ‘83’ లాంటి పెద్ద హిందీ సినిమా నార్త్ మార్కెట్లో నిలవలేకపోవడం ఆశ్చర్యం. ఐతే అప్పుడు అలా జరిగితే.. ఇప్పుడు నార్త్ మార్కెట్లో దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఓ చిన్న హిందీ సినిమా దెబ్బకు భారీ అంచనాలతో భారీ పాన్ ఇండియా సినిమా అయిన ‘రాధేశ్యామ్’ కుదేలవుతోంది. ఇది బేసిగ్గా తెలుగు సినిమానే అయినా.. ప్రభాస్‌కు నార్త్ మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. హిందీ కోసం ప్రత్యేకంగా పాటలు తీర్చిదిద్దారు.

అక్కడి పేరున్న ఆర్టిస్టులను కీలక పాత్రలకు తీసుకున్నారు. ఒక స్ట్రెయిట్ హిందీ సినిమా స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారు. కానీ ఇంత చేసినా ఫలితం లేకపోయింది. అక్కడ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్లోనే ‘రాధేశ్యామ్’ పెద్దగా ప్రభావం చూపలేదు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే చిన్న సినిమా ప్రభాస్ మూవీని గట్టి దెబ్బ కొట్టింది. ముందు దీన్ని చిన్న స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడం, డిమాండ్ పెరిగిపోవడంతో వెలవెలబోతున్న ‘రాధేశ్యామ్’ స్క్రీన్లను తీసి దానిచ్చేస్తున్నారు. ఈ రకంగా ‘పుష్ప’తో కొట్టిన దెబ్బకు టాలీవుడ్‌పై బాలీవుడ్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతోంది.

This post was last modified on March 14, 2022 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష… కేసు ఏంటంటే…?

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ… తన పేరు ముందు ఉన్న బిరుదు మాదిరిగా ప్రతి విషయాన్ని సెన్సేషనల్ గానే చేసుకుంటూ…

21 minutes ago

దిల్ రాజుగారు ఎందుకు రాలేదంటే

ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ బాక్సాఫీస్ సంభవం పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో…

1 hour ago

అరడజను రిలీజులున్నాయి….కానీ సందడి ఏదీ

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి, ఫలితాలు తేలిపోయాయి కాబట్టి మూవీ లవర్స్ ఫ్రెష్ గా రిలీజయ్యే…

2 hours ago

ఏపీ కొత్త పోలీస్ బాస్ ఆయనే.. బ్యాక్ గ్రౌండ్ ఇదే

అవును.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రానున్నారు. ఈ అంశంపై ఎవరు వస్తారన్న దానిపై ఇప్పటివరకున్న కన్ఫ్యూజన్ ఒక…

3 hours ago

10 సంవత్సరాల హిట్ మెషీన్ : అనిల్ రావిపూడి

ఎంత తలలు పండిన దర్శకులైనా రెండు మూడు హిట్లు పడ్డాక ఫ్లాపులు చూడటం సహజం. కెవి రెడ్డి, మణిరత్నం దగ్గర…

4 hours ago

పుష్ప 2 యాభై రోజులు – తగ్గకుండా కొట్టేసింది

గత కొన్నేళ్లలో అర్ధ శతదినోత్సవం, హండ్రెడ్ డేస్ పదాలు అరుదైపోయాయి. ఏ సినిమా అయినా ఎన్ని వందల కోట్లు వసూలు…

4 hours ago