మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వాసు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ తమ్ముడి పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరు, రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు.
ఆ తరువాత మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో ఓ పాటలో కనిపించారు రవితేజ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి వెండితెరపై కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం రవితేజ తీసుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకి రవితేజ 16 నుంచి 18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే మెగాస్టార్ సినిమాలో గెస్ట్ రోల్ కోసం రూ.10 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం రవితేజ 20 రోజుల కాల్షీట్స్ కేటాయించారట. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి రవితేజ గెస్ట్ రోల్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో ఇండస్ట్రీ సర్కిల్ లో డిస్కషన్ మొదలైంది. మెగాస్టార్ కోసం రవితేజ సినిమా ఒప్పుకున్నారా..? లేక భారీ రెమ్యునరేషన్ కోసమా అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఏదైతేనేం అభిమానులు మరోసారి చిరు-రవితేజ కాంబినేషన్ చూడబోతున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు ఇటీవల విమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం శృతి వరుస సినిమాలు చేస్తోంది. బాలకృష్ణ, ప్రభాస్ లతో కలిసి సినిమాలు చేస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది.
This post was last modified on March 14, 2022 12:58 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…