సమంత, అనుష్క.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా గడుపుతోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా సినిమాలు చేయడానికి అంగీకరిస్తుంది. మరోపక్క అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుంది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి నటిస్తోన్న ఓ సినిమాలో అనుష్క కనిపించనుంది.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాను మొదలుపెట్టలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఓ బయోపిక్ లో నటించమని అనుష్కని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే బయోపిక్ సమంత దగ్గరకు కూడా వెళ్లిందట. ఇంతకీ ఆ బయోపిక్ ఏంటంటే.. ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ స్టోరీ.
దర్శకుడు సింగీతం శ్రీనివాసరరావు చాలా కాలంగా ఈ బయోపిక్ తీయాలనుకుంటున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం 90 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు సింగీతం. ఇదొక దేవదాసి కథ. ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ సబ్జెక్ట్ గా దీన్ని రూపొందించారు. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా రైటర్ గా పని చేస్తున్నారు. డైలాగ్ వెర్షన్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. నాగరత్నమ్మ క్యారెక్టర్ లో ముందుగా సమంతను అనుకున్నారు. ఆమెకి కథ కూడా వినిపించారు.
కానీ ఈ సినిమా విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు అదే కథను అనుష్కకు కూడా వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. ఇంకాస్త సమయం కావాలని అడిగిందట అనుష్క. వీరిద్దరిలో ఎవరు ఓకే చెప్పినా.. వెంటనే ప్రాజెక్ట్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు సింగీతం శ్రీనివాసరావు. ఇలాంటి కథలో అనుష్క, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తేనే బాగుంటుందనేది సింగీతం ఆలోచన. మరి వీరిద్దరిలో ఈ బయోపిక్ కి ఎవరు ఓకే చెబుతారో చూడాలి!
This post was last modified on March 12, 2022 3:00 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…