పెళ్లి తర్వాత ఒక దశలో సినిమాలు బాగా తగ్గించేసి, చేసినా కూడా ట్రెడిషనల్ రోల్సే చేస్తూ నెమ్మదిగా ఫేడవుట్ అయిపోతున్నట్లు కనిపించింది సమంత. పెళ్లి తర్వాత హీరోయిన్లందరిదీ ఇదే వరస కాబట్టి అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ గత ఏడాది చైతూతో వివాహ బంధంలో ఉండగానే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్లో సమంత సెన్సేషనల్ రోల్‌తో అందరికీ పెద్ద షాకిచ్చింది. వివాహానంతరం ఇంత బోల్డ్ రోల్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
కానీ ఆ తర్వాతే తెలిసింది చైతూ నుంచి ఆమె విడిపోతోందని. అధికారికంగా విడాకులయ్యాక ఈ మధ్య ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ ఐటెం సాంగ్‌లో సమంత ఎంత షాకింగ్‌గా కనిపించిందో తెలిసిందే. కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ లేనంత హాట్‌గా ఈ పాటలో కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసిందామె. ఈ పాట ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
తాజాగా సామ్ ‘ఫ్యామిలీ మ్యాన్’లో తన పాత్రకు సంబంధించి ఒక అవార్డు అందుకోవడానికి ముంబయి వెళ్లింది. అక్కడ అందరి చూపులూ సమంత మీదే పడేలా సూపర్ హాట్‌గా డ్రెస్ చేసుకుని వెళ్లింది. ఈ ఫొటోలు నిన్న సాయంత్రం నుంచి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అవార్డుల వేడుకలో సమంత మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్, ఊ అంటావా పాటలు తనకు తెచ్చిన పాపులారిటీ గురించి ప్రస్తావించింది.
‘‘ఫ్యామిలీ మ్యాన్-2 సిరీస్‌తో పాటు ఊ అంటావా పాట నాకు పాన్ ఇండియా స్థాయిలో నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అభిమానులు చూపించే ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. ఊ అంటావా పాట ఇంత విజయం సాధిస్తుందని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులందరూ నేను చేసిన సినిమాలన్నింటినీ మర్చిపోయారు. ఇక ముందు నన్ను ఈ పాటతోనే గుర్తు పెట్టుకునేలా ఉన్నారు’’ అని సమంత పేర్కొంది.
This post was last modified on March 11, 2022 8:05 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…