మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద ఫ్యామిలీల వారసులకు దీటుగా అక్కినేని కుటుంబంలో సూపర్ స్టార్ అయిపోతాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరో.. అఖిల్. నాగచైతన్య అనుకున్న స్థాయిలో మాస్ ఇమేజ్ సంపాదించలేక మీడియం రేంజ్ హీరోగా స్థిరపడ్డ సమయంలో అక్కినేని అభిమానుల ఆశలు అఖిల్ మీదే నిలిచాయి.
చిన్నతనంలోనే ‘సిసింద్రీ’ సినిమా చేసి స్టార్ అయిపోయి.. టీనేజీలోకి వచ్చాక సినిమా చేయకముందే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అఖిల్.. తెరంగేట్రం చేయగానే ఎక్కడికో వెళ్లిపోతాడని అంతా అనుకున్నారు. కానీ అభిమానులు అంచనా వేసింది ఒకటి. జరిగింది ఒకటి. తొలి చిత్రం అఖిల్.. ఆ తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను.. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ఈ పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్లు, మాస్ ఇమేజ్ అన్నీ పక్కన పెడితే.. ఓ మోస్తరు విజయం దక్కితే చాలని చూశారంతా.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అలాంటి విజయమే దక్కింది అఖిల్‌కు.ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ఎవరిదన్నది పక్కన పెడితే.. అఖిల్ అయితే తొలి విజయం రుచి చూశాడు. కాస్త నిలదొక్కుకున్నాడు. ఇప్పుడిక మాస్ హీరోగా ఎదిగే ప్రయత్నంలో అతను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో జట్టు కట్టాడు. వీరి కలయికలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర్నుంచే హైప్ మొదలైంది. ఇటీవల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర చేస్తున్నాడనగానే ఇంకా హైప్ పెరిగింది.
ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ కూడా బయటికి వచ్చేసింది. మరీ ఆలస్యమేం లేకుండా ఆగస్టు 12నే ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ అప్ డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అక్కినేని అభిమానులను వెర్రెత్తిస్తోంది. అఖిల్‌ను ఎంత స్టైలిష్‌గా, ఎంత మాస్‌గా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారీ పోస్టర్లో. ఇది చూసి ఇదేం మాస్ రా మావా అనే మీమ్ కూడా షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ పోస్టర్లో ఉన్నంత కిక్కు సినిమాలోనూ ఉండి అక్కినేని ఫ్యాన్స్ దాహం తీరుతుందేమో చూడాలి.
This post was last modified on March 11, 2022 7:55 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…