సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ‘దబంగ్’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అభినవ్ కశ్యప్.. సల్మాన్ ఖాన్ సంస్థలో దీనికి సీక్వెల్ సినిమా చేయనందుకు గాను అతడి తమ్ముళ్లు తనపై కక్ష గట్టి ఎలా కెరీర్‌ను నాశనం చేశారో చాలా వివరంగా ఒక పెద్ద పోస్టు పెట్టాడు ఫేస్ బుక్‌లో.
‘దబంగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక అభినవ్ పదేళ్లలో చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా (బేషారం) విడుదలకు కూడా అనేక అడ్డంకులు ఎదురయ్యాయని.. సల్మాన్ తమ్ముళ్లు దాని రిలీజ్ ఆపేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారని అభినవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సినిమా చేయడానికి ముందు రెండు బేనర్లలో తాను సినిమాలు కోల్పోవడానికి కారణం కూడా సల్మాన్ తమ్ముళ్లు అర్బాజ్, సోహైల్‌లే అని కూడా అభినవ్ ఆరోపించాడు.
దీనిపై సల్మాన్, అతడి తమ్ముళ్లు ఎలా స్పందిస్తారా అని బాలీవుడ్ అంతా ఎదురు చూస్తోంది. ఐతే వాళ్లిద్దరూ తీవ్రంగానే స్పందించారు. అభినవ్ మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోయారు. అతడిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు అర్బాజ్, సోహైల్ మీడియాకు వెల్లడించారు. అభినవ్ ఆరోపణలన్నీ అసత్యాలని.. అతను తమ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేశాడని.. ఇందుకు అతడికి తగిన బుద్ధి చెబుతామని అర్బాజ్ అన్నాడు.
అభినవ్‌కు ఇప్పటికే వాళ్లు నోటీసులు కూడా పంపినట్లు చెబుతున్నారు. దీనిపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా స్పందించాడు. ఈ విషయంపై తానైతే స్పందించి సమయం వృథా చేసుకోనని అన్నాడు. ఐతే అభినవ్ కెరీర్ ఏమాత్రం ముందుకు సాగకుండా ‘దబంగ్’ తర్వాత ఒక్క చిత్రంతో ఆగిపోయిన నేపథ్యంలో అతడి ఆరోపణల్లో నిజం లేకపోలేదనే జనాలు భావిస్తున్నారు.
This post was last modified on June 20, 2020 12:13 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…