ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే గేయ రచయితగా మారి.. చిన్న వయసులోనే అత్యున్నత స్థాయి సాహిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచిన కుర్రాడు అనంత శ్రీరామ్. అతడి వయసు ఇప్పుడు 37 ఏళ్లు కాగా.. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తి కావడం విశేషం. ఇంత చిన్న వయసులో ప్రతిభ చాటుకున్న గేయ రచయితలు అరుదుగా ఉంటారు.
‘ఒక ఊరి’లో సినిమాతో లిరిసిస్టుగా తన ప్రయాణాన్ని ఆరంభించి ఇప్పటికే వందల సినిమాల్లో పాటలు రాశాడు. అనంత శ్రీరామ్ ఇప్పటిదాకా దాదాపు వెయ్యి పాటలు రాయడం విశేషం. ఈ మధ్యే ‘సర్కారు వారి పాట’ కోసం శ్రీరామ్ రాసిన ‘కళావతి’ పాట ఎంత పాపులరైందో తెలిసిందే. ఈ పాటతో చర్చనీయాంశంగా మారిన అనంత శ్రీరామ్.. తాజాగా ఎవ్వరూ తనలో ఎవ్వరూ ఊహించని ఓ కొత్త కోణాన్ని చూపించాడు.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.జీటీవీ వాళ్లు నిర్వహించే మ్యూజికల్ షో ‘సరిగమప’కు జడ్జీల్లో ఒకరిగా వ్యవహరిస్తున్న అనంత శ్రీరామ్.. తాజాగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. స్టేజ్ మీదికి మామూలుగా ఎంట్రీ ఇచ్చిన అనంత శ్రీరామ్.. ఉన్నట్లుండి మైండ్ బ్లోయింగ్ అనిపించే స్టెప్పులేశాడు. కింద చేతులు పెట్టి మిగతా బాడీనంతా రింగులు తిప్పుతూ ప్రొఫెషనల్ డ్యాన్సర్లలాగా అతను చేసిన విన్యాసాలు చూసి నెటిజన్లకు బుర్ర పాడైపోతుంది.
ఎప్పుడూ చాలా సాత్వికంగా కనిపిస్తూ, చాలా నెమ్మదిగా మాట్లాడే అనంత శ్రీరామ్‌లో ఇంత ఫైర్ ఉందా.. ఈయనలో ఇదేం యాంగిల్ బాబోయ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది నిజంగా శ్రీరామేనా అని ఆశ్చర్యపోతున్నారు. ఎంతైనా ఇంజినీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కదా.. ఆ రోజుల్లో కాలేజీల్లో డ్యాన్సులవీ వేసిన అనుభవం శ్రీరామ్‌కు ఉన్నట్లుంది. అది ఇన్నాళ్లూ దాచి పెట్టి ద్వితీయార్ధంలో ఇప్పుడిలా బయటికి తీసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు.
This post was last modified on March 10, 2022 9:28 pm
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…
నేను అసెంబ్లీకి వెళ్లిన దానికంటే జైలుకు వెళ్లిన రోజులే ఎక్కువగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట…
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…