బాలీవుడ్‌తోనే కెరీర్ స్టార్ట్ చేసినా.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయిపోయింది తమన్నా భాటియా. ఆ తర్వాత సౌత్‌లో చక్రం తిప్పుతూనే అప్పుప్పుడూ బాలీవుడ్‌లో మెరుస్తుండేది. హిమ్మత్‌వాలా, హమ్‌షకల్స్, ఎంటర్‌టైన్‌మెంట్, ఖామోషీ లాంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ దూకుడు చూపిస్తోంది. బీటౌన్‌లో మరింతగా దూసుకుపోతోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో గుర్తుందా శీతాకాలం, ఎఫ్3, భోళాశంకర్ చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. ‘గని’లో ఓ స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఇందుకు ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్‌లోనూ చాలా ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతోంది. ఇప్పటికే బోలె చూడియా, ప్లాన్ ఎ ప్లాన్ బి చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా ‘బబ్లీ బౌన్సర్’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీకి కూడా కమిటయ్యింది.
మహిళా ప్రాధాన్యతని అద్భుతంగా చూపించే దర్శకుడు మధుర్ భండార్కర్. ఆయన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ ఉండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొన్ననే ప్రకటించిన ఈ సినిమాని ఆల్రెడీ సెట్స్‌కి తీసుకెళ్లడం, ఒక షెడ్యూల్ కంప్లీట్ చేయడం కూడా జరిగిపోయాయి. బౌన్సర్లు అధికంగా ఉండే ఓ నార్త్ ఇండియన్ టౌన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమన్నా కూడా బౌన్సర్‌గా కనిపించబోతోంది.
ఇవన్నీ ఒకెత్తు.. రీసెంట్‌గా రిలీజైన మ్యూజిక్ వీడియో ఒకెత్తు. ఫేమస్ సింగర్ బాద్‌షా ‘తబాహీ’ అనే సాంగ్ చేశాడు. ఈ వీడియోలో అతనితో కలిసి నటించింది తమన్నా. బేసిగ్గా మంచి డ్యాన్సరేమో.. గ్లామర్‌తో పాటు స్టెప్స్‌తోనూ అదరగొట్టింది. ఇప్పుడీ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే నార్త్‌లో తమన్నా జోరు ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది.
This post was last modified on March 10, 2022 4:21 pm
రేపు శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ షాట్ పేరుతో పెద్ది టీజర్ విడుదల చేయబోతున్నారు. గేమ్ ఛేంజర్ దెబ్బకు తీవ్ర నిరాశలో…
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఓ వర్గం అభిమానుల్లో నిరాశ మొదలైంది. ఎక్కువ అంచనాల మధ్య బరిలోకి…
స్టార్ క్యాస్టింగ్ లేకుండా హనుమాన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం దాని సీక్వెల్ జై హనుమాన్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన బాల్యం, విద్యాభ్యాసం గురించి శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదికలో…
కేవలం అయిదే రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది. ఏప్రిల్ 10 రిలీజని వారాల కృత్రమే ప్రకటించినప్పటికీ ప్రమోషన్ల…
ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై…