వలిమై.. తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన అజిిత్ నటించిన కొత్త చిత్రం. గత నెల 24న భారీ అంచనాలతో విడుదలైందీ సినిమా. తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా చూసి మన వాళ్లు వేస్ట్ అని తేల్చేశారు. అదే పాత కథ.. రొటీన్ సన్నివేశాలు, ఓవర్ డోస్ సెంటిమెంటుతో మన వాళ్లను విసుగెత్తించిందీ సినిమా. యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే ఇందులో చెప్పుకోదగ్గ ఆకర్షణలేమీ కనిపించలేదు.
అసలే టాక్ బాగా లేదు. పైగా రెండో రోజే ‘భీమ్లా నాయక్’ రిలీజైంది. దీంతో ‘వలిమై’ అడ్రస్ లేకుండా పోయింది. టాక్ పరంగా చూసినా, వసూళ్ల పరంగా చూసినా తెలుగులో ఈ చిత్రాన్ని డిజాస్టర్‌గా చెప్పొచ్చు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు పట్టం కట్టేశారు. దీన్ని బ్లాక్‌బస్టర్‌ను చేసేశారు. అక్కడ ఈ సినిమాకు టాక్ బాగుంది. వసూళ్లకూ ఢోకా లేదు. రెండో వారంలోనూ ‘వలిమై’ వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది.
తమిళనాట పాత రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న ‘వలిమై’ రూ.200 కోట్ల క్లబ్బులో చేరినట్లుగా అక్కడి ట్రేడ్ పండితులు పేర్కొంటుండటం విశేషం. రెండో వీకెండ్ తర్వాత కూడా, వీక్ డేస్‌లోనూ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ వస్తోందట. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ పడుతున్నాయట. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ముందుకు వెళ్తోంది. ఇంత రొటీన్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం అనూహ్యం.
ఒకప్పుడు కొత్త తరహా చిత్రాలకు పట్టం కట్టి, రొటీన్ సినిమాలను తిరస్కరించి తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు కొన్నేళ్లుగా పరమ రొటీన్ సినిమాలనే నెత్తిన పెట్టుకుంటున్నారు. అన్నాత్తె (పెద్దన్న’ లాంటి పేలవమైన సినిమాకు అక్కడ మంచి వసూళ్లు వచ్చాయి. హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయి ఫైనల్‌గా అక్కడ ఈ చిత్రం హిట్ అనిపించుకుంది. ఇలా గత కొన్నేళ్ల నుంచి రొటీన్ మాస్ మసాలా సినిమాలే అక్కడ రాజ్యమేలుతుండటం గమనార్హం.
This post was last modified on March 9, 2022 5:12 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…