Movie News

శ్రుతీహాసన్‌కి మెగా ఆఫర్

స్టార్ హీరో సినిమా అనగానే హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఇక చిరంజీవి లాంటి స్టార్‌‌ విషయంలో ఆ ప్రశ్న మరింత వేగంగా వస్తుంది. ఎందుకంటే చిరు సినిమాలో హీరోయిన్ కేవలం నటిస్తే చాలదు.. ఆయనతో సమానంగా డ్యాన్సులు కూడా చేయాలి.

అందుకే ఆయనకి జోడీగా నటించే అమ్మాయిని ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంటారు. బాబి కూడా అదే చేశాడు. ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఎట్టకేలకు శ్రుతీహాసన్‌ను సెలెక్ట్ చేశాడు. చిరంజీవి 154వ సినిమా బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో షూటింగ్ కూడా మొదలైంది.

ఇందులో చిరు గ్యాంగ్‌స్టర్‌‌గా కనిపిస్తారని, అండర్ కవర్‌‌ ఏజెంట్‌గా కనిపిస్తారని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాల్తేరు మొనగాడు అనే టైటిల్‌ పెడుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌ విషయంలోనూ రకరకాల పేర్లు వినిపించాయి. చివరికి శ్రుతిని సెలెక్ట్ అయ్యింది.       

ఉమెన్స్ డే సందర్భంగా శ్రుతి పేరును అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రుతి, చిరంజీవి, బాబి కలిసున్న ఫొటోస్‌ని కూడా రిలీజ్ చేశారు. శ్రుతి తమ టీమ్‌లో చేరడం ఆనదంగా ఉందంటూ ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్‌ చెబుతూ ట్వీట్స్ చేశారు చిరు, బాబి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలతో నటించిన శ్రుతి.. ఇప్పుడు మరో చిరంజీవితో నటించే చాన్స్ కూడా కొట్టేసింది. 

This post was last modified on March 9, 2022 8:06 am

Share
Show comments

Recent Posts

గాయమైన వెనక్కి తగ్గని రాహుల్ ద్రవిడ్

టీమిండియా మాజీ ప్లేయర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌ టీమ్ కు హెడ్ కోచ్ గా కూడా కొనసాగుతున్న…

1 hour ago

జాక్ కోసం ఎన్నో జాగ్రత్తలు

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ కొత్త…

2 hours ago

అంతులేని ప్రచారాల్లో అల్లు అర్జున్ 22

పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకాన్ స్టార్ బన్నీ చేయబోయే కొత్త సినిమా గురించి పరిశ్రమ, మీడియా వర్గాల్లో…

2 hours ago

బుల్లితెర TRP – వైడి రాజు సంచలనం

జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం…

5 hours ago

తారక్ ఫిక్స్….రజిని నెక్స్ట్

ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్…

5 hours ago

నాలుగేళ్ల తర్వాత జూనియర్ శ్రీకాంత్ దర్శనం

నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత…

5 hours ago