ఒకప్పుడు టాలీవుడ్లో రచయితలంటే రచయితలుగానే ఉండేవారు. కొద్ది మంది మాత్రమే దర్శకులుగా మారేవారు. కానీ తర్వాత కథ మారిపోయింది. రచయితలందరి లక్ష్యంగా దర్శకులుగా మారడమే అవుతోంది. రచయితగా ప్రస్థానం ఆరంభించి దర్శకుడిగా టాప్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ స్ఫూర్తితో ఎంతోమంది రచయితలు దర్శకులుగా మారారు. ఇలా టాలీవుడ్లో చాలా కాలం రచయితగా పని చేసి.. దర్శకత్వ కలను నెరవేర్చుకున్న వారిలో బీవీఎస్ రవి ఒకరు.
కానీ రచయితలుగా అతడికున్నంత పేరు లేకపోయినా చాలామంది దర్శకులుగా సక్సెస్ అయ్యారు కానీ.. రవి మాత్రం మెగా ఫోన్ పట్టి విజయాన్నందుకోలేకపోయాడు. తొలి చిత్రం ‘వాంటెడ్’ పెద్ద డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘జవాన్’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో మళ్లీ రైటర్‌గానే కొనసాగుతున్నాడు రవి. త్వరలో విడుదల కాబోతున్న ‘థ్యాంక్ యు’ అతడి స్క్రిప్టుతోనే తెరకెక్కింది.ఐతే బీవీఎస్ రవి దర్శకత్వ ఆశలను మాత్రం పక్కన పెట్టేయలేదు. మళ్లీ అతను ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈసారి రవి టార్గెట్ పెద్దదే అంటున్నారు. ఇటీవల రవి.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’లో వచ్చిన ‘అన్ స్టాపబుల్’ షోకు రైటర్ కమ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆ షో ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అదొక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. బాలయ్యను ఈ షోలో ప్రెజెంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. లుక్స్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ బాలయ్య సరికొత్తగా కనిపించాడు.
ఈ క్రెడిట్ చాలా వరకు రవికే చెందుతుంది. ఈ షో చేస్తూ బాలయ్యకు బాగా దగ్గరైన రవి.. ఆయనకు ఓ కథ చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. బాలయ్య కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నాడని, రవితో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపే అవకాశాలున్నాయని అంటున్నారు. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి టైం పట్టొచ్చు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న బాలయ్యకు అనిల్ రావిపూడితో ఓ కమిట్మెంట్ ఉంది. బోయపాటితో ఇంకో సినిమాకు కూడా ఓకే చెప్పాడంటున్నారు. మరి ఇన్ని సినిమాల మధ్య రవికి నిజంగానే బాలయ్య ఛాన్సిస్తాడేమో చూడాలి.
This post was last modified on March 7, 2022 7:52 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…