Movie News

ఎన్టీఆర్.. చరణ్ అభిమానులు మారరా?

ఇంకో మూడు వారాల్లోపే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్లలో ఇద్దరైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. వీరి అపూర్వ కలయికలో సినిమా రూపొందించిన రాజమౌళిని తటస్థ ప్రేక్షకులందరూ అభినందిస్తున్నారు. ఈ కలయికలో సినిమా చూడ్డం అందరికీ ఆనందమే కావాలి.

ఆ హీరోలు ఎలా అయితే భేషజాలు పక్కన పెట్టి.. రాజమౌళికి బెండ్ అయి ఇంకేమీ ఆలోచించకుండా ఈ సినిమా చేశారో.. అభిమానులు కూడా అంతే ఓపెన్ మైండ్‌తో ఉండి ఈ అరుదైన కలయికలో సినిమాను ఆస్వాదించడానికి సిద్ధపడాలి.

కానీ ఈ సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి వాళ్లది ఒకటే గోల. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప.. ప్రోమోల్లో మా హీరో హైలైట్ అయ్యాడంటే మా హీరో హైలైట్ అయ్యాడు.. సినిమాలో కూడా మా వాడిదే పై చేయి అంటే మావాడిదే పైచేయి అని రెండు మూడేళ్ల నుంచి తెగ కొట్టేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.

ఇప్పుడు రిలీజ్ ముంగిట కూడా ఈ గొడవ తప్పట్లేదు. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ప్రి సేల్స్ ఓ రేంజిలో జరుగుతున్నాయి. అక్కడ బాక్సాఫీస్‌ను షేక్ చేసే స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు దీటుగా ‘ఆర్ఆర్‌ఆర్’ వసూళ్లు సాధించబోతుండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు తెలుగు ప్రేక్షకులు అందరూ గర్వించాలి.

కానీ తారక్, చరణ్ అభిమానులు మాత్రం ఇది మానేసి ఇప్పుడు కూడా ‘క్రెడిట్’ కోసం కొట్టేసుకుంటున్నారు. ప్రి సేల్స్ ఇలా జరగడానికి తమ హీరో కారణమంటే తమ హీరో కారణమని గొప్పలు పోతున్నారు. ఒక ఎన్టీఆర్ అభిమాని ఎవరో ఒక్కడే 75 టికెట్లు కొన్నాడట. దాని మీద కూడా పెద్ద డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు.

ఇలా మీ హీరోకు ఎవరైనా చేశారా అని తారక్ అభిమానులు అనడం. ఫలానా ఏరియాలో రామ్ చరణ్ అభిమానులే ఎక్కువ టికెట్లు కొంటున్నారు. ప్రి సేల్స్‌లో తమ హీరో పేరు మీద తెగిన టికెట్లే ఎక్కువ అని చరణ్ అభిమానులు అనడం. దీంతో పాటుగా ప్రోమోల్లోని షాట్లు తీసి మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అని ఎప్పట్లాగే కొట్టుకోవడం ఇదీ వరస. వీళ్లు ఇంకెప్పటికి మారతారో మరి.

This post was last modified on March 7, 2022 5:10 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఇటు సత్యదేవ్ అటు రోహిత్ మధ్యలో కోతులు

మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…

22 mins ago

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…

1 hour ago

నిఖిల్ క్రేజీ మూవీ ఏమైనట్టు

రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ కార్తికేయ 2తో పెద్ద బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న యూత్…

1 hour ago

ప్ర‌చారంలో దుమ్మురేపుతున్న భ‌ర్త‌లు!

రాజ‌కీయాలు మారాయి. ఒక‌ప్పుడు భ‌ర్త‌లు ఎన్నిక‌ల రంగంలో ఉంటే.. భార్య‌లు ఉడ‌తా భ‌క్తిగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చూసుకునే వారు. అది…

3 hours ago

థియేటర్ల నిస్తేజం – బాక్సాఫీసుకు నీరసం

ఎదురుచూసేకొద్దీ బాక్సాఫీస్ కు జోష్ ఇచ్చే సినిమాలు రావడం అంతకంతా ఆలస్యమవుతూనే ఉంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తెగుతున్న సింగల్ డిజిట్…

4 hours ago

తెర‌పైకి మ‌రోసారి బెట్టింగులు.. ఏపీలో హాట్ సీట్ల‌పైనే!

రాజ‌కీయంగా చైత‌న్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ‌. అటు క్రికెట్ అయినా.. ఇటు రాజ‌కీయాలైనా.. తెలంగాణ లో హాట్ టాపిక్కే. ఇక్క‌డ…

4 hours ago