Movie News

రేప్ కేసులో దర్శకుడి అరెస్ట్

‘మీ టూ’ ఉద్యమం మొదలైన దగ్గర్నుంచి సినీ పరిశ్రమలో ఎన్నో లైంగిక వేధింపుల కేసులు బయటికి వచ్చాయి. అంతకుముందు గుట్టుగా ఉండిపోయిన చాలా విషయాలు తర్వాత బహిర్గతం అవడం మొదలైంది. ఈ క్రమంలో నిజంగా వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ధైర్యంగా గొంతు విప్పడం మొదలైంది.

అదే సమయంలో పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తూ.. ఉన్నట్లుండి విభేదాలు తలెత్తడం వల్ల ఆ బంధంలో ఉన్న మహిళ.. తన భాగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, లైంగిక వేధంపులు, అత్యాచార ఆరోపణలతో కేసులు పెట్టడం.. ఇలాంటి ఉదంతాలు చాలా చూశాం.

ఇప్పుడు కేరళలో కూడా ఇలాంటి కేసే ఒకటి బయటికి వచ్చింది. మలయాళ సినీ పరిశ్రమకు చెందిన లిజు కృష్ణ అనే దర్శకుడిపై ఓ మహిళల రేప్ కేసు పెట్టింది. పోలీసులు అతణ్ని అరెస్టు చేసి జైల్లో పెట్టడం సంచలనం రేపింది.

లిజు కృష్ణ.. ‘పడవేట్టు’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం గమనార్హం. ఆ చిత్రంలో నివిన్ పౌలీ, మంజు వారియర్ లాంటి పెద్ద నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దర్శకత్వ కల నెరవేరుతున్న సమయంలో లిజు అనూహ్యంగా రేప్ కేసులో చిక్కుకుని అరెస్టయ్యాడు. ఈ చిత్ర బృందంలో పని చేస్తున్న అమ్మాయే అతడిపై కేసు పెట్టింది. ఆమెతో అతను కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఐతే తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయి అడగ్గా.. లిజు కృష్ణ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లిజు మీద రేప్ కేసు పెట్టింది. ఆ అమ్మాయి పేరును పోలీసులు బయట పెట్టలేదు. లిజు దర్శకత్వం వహిస్తున్న ‘పడవేట్టు’ సినిమా చిత్రీకరణ అర్ధంతరంగా ఆగిపోయింది. మరి ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుంది.. ఈ సినిమా పరిస్థితేంటి అన్నది అయోమయంగా మారింది.

This post was last modified on March 7, 2022 5:06 pm

Share

Recent Posts

11 నెలల్లో 23 మరణ శిక్షలు – న్యాయమూర్తి బదిలీ

దేశంలో చాలామంది న్యాయమూర్తులు వున్నారు. వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టగలిగిన వాళ్ళ పేర్లే ప్రజలకు తెలుసు. కానీ రవికుమార్ దివాకర్…

2 hours ago

గీత గోవిదం వదిలేశా… రంగస్థలంలో తీసేశారు

ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని…

3 hours ago

చెన్నై ఆటోల్లో తిరుగుతున్న ఓజీ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…

4 hours ago

గరివిడి లక్ష్మి… ఇదేం విడ్డూరం

ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…

4 hours ago

ఒక్కడి పని ముగ్గురు కుర్రాళ్లతో చేయిస్తున్న గంభీర్!

టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…

5 hours ago

రైట్స్ తీసుకోకుండానే రీమేక్ షూటింగ్

ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి…

6 hours ago