Movie News

నితిన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీస్ కోసం టాలీవుడ్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అందుకే మిగతా భాషల కంటే మన దగ్గరే నార్త్ హీరోయిన్స్ ఎక్కువ వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు మరొక బాలీవుడ్‌ బ్యూటీ కూడా తెలుగునాట జెండా పాతడానికి ట్రై చేస్తోంది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశీ రౌతేలా.     

ఆల్రెడీ ఊర్వశి ఓ తెలుగు సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అదే ‘బ్లాక్‌ రోజ్‌’. సంపత్ నంది అందించిన కథతో మోహన్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఇప్పుడు నితిన్ నటిస్తన్న ‘మాచర్ల నియోజకవర్గం’ లోనూ ఊర్వశి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెస్ రాజశేఖర్‌‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో ఆల్రెడీ కీర్తి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఒక కీలక పాత్ర కోసం ఊర్వశిని తీసుకున్నారని సమాచారం.       

నిజానికి పుష్ప సినిమా విషయంలోనూ ఊర్వశి పేరు వినిపించింది. ఊ అంటావా ఊఊ అంటావా పాటకి మొదట ఆమెనే అడిగారట. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారని వార్తలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని తర్వాత సమంతను తీసుకున్నాడు సుకుమార్. ఇప్పుడు నితిన్ సినిమాలో ఊర్వశి నటించడం నిజమా కాదా అనేది కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే కానీ చెప్పలేం.        

ప్రస్తుతానికైతే ఆమె ఓ తమిళ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. మొన్నటి వరకు ఉక్రెయిన్‌లో షూటింగ్ జరిగింది. ఆ దేశంపై రష్యా దాడి చేయడానికి సరిగ్గా రెండు రోజుల ముందే ఇండియాకి తిరిగొచ్చింది ఊర్వశి. ఆ దేశానికి చెందిన మ్యుజీషియన్‌ మొనాటిక్‌తో కలిసి ఓ మ్యూజిక్ వీడియో కూడా చేయబోతోంది. మరి తెలుగు సినిమా సంగతి త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాలి. 

This post was last modified on March 7, 2022 9:52 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

7 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

8 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

8 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

8 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

10 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

10 hours ago