ప్రతి డైరెక్టర్‌కీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టే పూరి జగన్నాథ్‌కీ ఉంది.. జన గణ మన. ఈ కథని చాలాకాలం క్రితమే రాసుకున్నాడు పూరి. మహేష్‌తో తీయాలని కలలు కూడా కన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి వేరే సినిమాలపై దృష్టి పెట్టాడు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీ టాపిక్ తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండతో ‘జన గణ మన’ తీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు పూరి. నిర్మాతల్లో ఒకరైన చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో పడింది.
అయితే పూరి తన ప్రాజెక్టు గురించి మళ్లీ ఆలోచించే ఈ గ్యాప్‌లో మరో రెండు భాషల్లో ఇదే టైటిల్‌తో సినిమాలు మొదలయ్యాయి. జయం రవి హీరోగా తమిళంలో ‘జన గణ మన’ తయారవుతోంది. ఇందులో తాప్సీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం రవి ‘పొన్నియిన్ సెల్వన్’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ‘జన గణ మన’ కూడా త్వరలో విడుదలయ్యే చాన్స్ ఉంది.
అలాగే మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా ‘జన గణ మన’ పేరుతో ఓ సినిమా రెడీ అయ్యింది. సూజర్ వెంజరమూడు మరో కీలక పాత్రలో నటించాడు. డిజో జోస్ ఆంటోనీ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా పృథ్విరాజ్ ప్రకటించాడు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ టైటిల్‌ని దేశభక్తి సినిమాలకు తప్ప మరోదానికి వాడలేం. కాబట్టి మూడు చిత్రాలూ పేట్రియాట్రిక్ మూవీసే అనడంలో సందేహం లేదు. అయితే ఎవరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నారు, ఏ సినిమా ఎలా ఉండబోతోంది అనేది క్యూరియాసిటీ కలుగుతోంది. అందరి కంటే ముందు పృథ్విరాజ్ వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత జయం రవి కచ్చితంగా వచ్చేస్తాడు. ఇక పూరి ఈ సినిమాని ఎప్పటికి సెట్స్‌కి తీసుకెళ్తాడో, ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తాడో, రవి కంటే ముందే వస్తాడా లేక తర్వాత వస్తాడా అనేది చూడాలి మరి.
This post was last modified on March 6, 2022 9:02 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు ప్రత్యేక…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…