Movie News

హహా హాసిని.. రీఎంట్రీలో ఏం చేయబోతోంది?

జెనీలియా డిసౌజా.. తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేని కథానాయిక. డబ్బింగ్ సినిమా ‘బాయ్స్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముంబయి భామ.. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్లిపోయింది. ఈ సినిమాలో హాసిని పాత్ర చూసి ఫిదా అయిపోయి.. ఇలాంటమ్మాయే తమ జీవిత భాగస్వామిగా కావాలని కోరుకున్న అబ్బాయిలు ఎంతమందో.

దీంతో పాటు సత్యం, రెడీ, సై, సాంబ, సుభాష్ చంద్రబోస్, నా అల్లుడు, హ్యాపి, ఆరెంజ్ లాంటి పేరున్న చిత్రాల్లో నటించి ఒక సమయంలో టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది ఈ భామ. ఐతే రానా సరసన చేసిన ‘నా ఇష్టం’ తర్వాత జెనీలియా తెలుగు తెరపై కనిపించలేదు. తర్వాత హిందీలో ఒకటీ అరా సినిమాలు చేసి.. తన తొలి చిత్ర కథానాయకుడు రితీశ్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయింది.

ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జెనీలియా.. ఈ మధ్య మళ్లీ పూర్వపు అందం సంతరించుకునేందుకు బాగా కష్టపడుతోంది. వర్కవుట్లవీ చేసి మంచి షేప్‌లోకి వచ్చిన జెన్నీ.. హిందీలో ‘ఇట్స్ మై లైఫ్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమెది పూర్తి స్థాయి పాత్ర కాదు. ఆ సినిమా అంతగా ఆడలేదు కూడా. మళ్లీ గ్యాప్ తీసుకున్న జన్నీ.. హిందీలో, మరాఠీలో ఒక్కో సినిమాలో నటిస్తోంది. ఈలోపు ఆమెకు తెలుగులో చాలా కాలానికి ఒక ఛాన్స్ రావడం విశేషం. దాదాపు దశాబ్దం తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించనుంది.

ఈ చిత్రంతో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి తనయుడు కిరీటి కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. వారాహి చలనచిత్రం బేనర్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘పెళ్ళి సందడి’ ఫేమ్ శ్రీలీల హీరోయిన్. జెనీలియా ఇందులో ప్రత్యేక, కీలక పాత్ర చేస్తోంది. ఆమె పాత్ర ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ హీరోయిన్‌కు దీటుగా ఆ క్యారెక్టర్ కీలకంగా ఉంటుందని, అందుకే ఏరి కోరి ఈ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వడానికి జెన్నీ రెడీ అయిందని అంటున్నారు. ఈ చిత్రంతో రాధాకృష్ణ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు.

This post was last modified on March 5, 2022 11:37 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

17 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

54 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

3 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

4 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

5 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago