సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్. అతనో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. మార్కెట్‌లోనూ సందడి మామూలుగా ఉండదు. ఎప్పుడు విడుదలవుతుంది, ఎన్ని కోట్లు రాబడుతుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అంటూ ఒకటే చర్చలు. ‘టైగర్ 3’ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్స్ కావడంతో మూడో పార్ట్ అంతకు మించి ఉంటుందని ఊహిస్తున్నారంతా.
మనీష్ శర్మ డైరెక్షన్‌లో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ ఒకటి వచ్చింది. వచ్చే యేడు రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21న ‘టైగర్ 3’ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా ఓ టీజర్‌ని కూడా విడుదల చేశారు. విచిత్రం ఏమిటంటే.. ఈ వీడియోని చూసినవాళ్లెవరూ సల్మాన్ గురించి మాట్లాడటం లేదు.. కత్రినా గురించి తప్ప.
వీడియో ఓపెన్ కాగానే కత్రినా పులిపిల్లలా దూసుకొచ్చింది. ఓ కత్తి పట్టుకుని శత్రువు మీదికి దాడి చేసింది. చేతిని గిరగిరా తిప్పుతూ, ఒంటిని స్ప్రింగ్‌లా వంచుతూ ఆమె ఫైట్ చేసిన విధానం అదిరిపోయింది. ఆ తర్వాత ఆమె వెళ్లి పక్కనే ముసుగేసుకుని పడుకుని ఉన్న సల్మాన్‌ని లేపి ఇక నీ టర్న్ అంది. రెడీనా అడిగితే అతను ‘టైగర్ ఈజ్ ఆల్వేజ్ రెడీ’ అంటూ యుద్ధానికి సిద్ధమయ్యాడు.
అయితే ఎప్పుడూ సల్మాన్‌ని చూసి విజిల్స్ వేసే జనం ఈ వీడియో విషయంలో మాత్రం కత్రినా కేక అంటూ కాంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. టైగ్రస్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాను కామెంట్లతో నింపేస్తున్నారు. గత చిత్రాల్లోనూ యాక్షన్ సీన్స్‌ని అద్భుతంగా పండించింది క్యాట్. అయితే ఈసారి అంతకు మించిన ఎనర్జీతో కనిపిస్తోందామె. దాంతో అందరి కళ్లూ కత్రినా మీదే ఉన్నాయి.
This post was last modified on March 4, 2022 8:47 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…