samantha
పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ డల్ అయిపోవడం చాలాసార్లు చూశాం. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్నవాళ్లని ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి ఇది బాలీవుడ్‌లోనే ఎక్కువ జరుగుతుంది. కానీ సౌత్ హీరోయిన్లు కూడా అందుకు తక్కువేం కాదని సమంత ప్రూవ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా ఆమె బిజీ హీరోయిన్‌గానే కొనసాగింది. విడాకుల తర్వాత కూడా అదే హవాని కంటిన్యూ చేస్తోంది.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో చాలా ప్రాజెక్టులు సమంత కోసం క్యూలో నిలబడ్డాయి. మరోవైపు హిందీ సీమ కూడా ఆమెకి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. త్వరలో అక్కడ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోంది సామ్. అయితే సినీ లవర్స్‌కి వీటిలో ఏదీ ఇవ్వని కిక్.. రీసెంట్‌గా బైటికొచ్చిన ఓ వార్త ఇస్తోంది. విజయ్ దేవరకొండ సరసన సమంత కనిపించబోతోందనేదే ఆ న్యూస్.
ప్రస్తుతం ‘లైగర్’ మూవీతో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే పూరి జగన్నాథ్‌తో ‘జన గణ మన’ కూడా చేయబోతున్నాడు విజయ్. నిర్మాతల్లో ఒకరైనా చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో ఉంది. వీటిలో ముందుగా శివ సినిమా సెట్స్‌కి వెళ్తుంది. ఆ తర్వాత పూరి సినిమా మొదలవుతుంది. అయితే ఈ రెండింటి మధ్యన విజయ్ మరో మూవీకి కూడా కమిటయ్యాడని, అందులోనే సమంత హీరోయిన్‌గా చేయబోతోందని టాక్.
నిజానికి శివ, పూరి కాకుండా విజయ్‌తో టై అప్ అయ్యింది దర్శకుడు సుకుమార్. ఆల్రెడీ అతను తీసిన ‘రంగస్థలం’లో సామ్ యాక్ట్ చేసింది. ఆ పాత్రని ఆమె పండించిన విధానానికి సుకుమార్ ఫ్లాటైపోయాడు కూడా. సమంతని పొగడ్తలతో ముంచెత్తిన సుకు, ఆమెతో మళ్లీ వర్క్ చేయాలనుందని కూడా అప్పట్లో అన్నాడు. అందుకే విజయ్ సినిమాలో సామ్‌నే ఫిక్స్ చేసి ఉండొచ్చు. విజయ్, సామ్‌లు కూడా ఇంతకుముందు ‘మహానటి’ కోసం జోడీ కట్టారు. అయితే అందులో వాళ్ల పాత్రలు పరిమితంగానే ఉంటాయి. ఈసారి ఫుల్ లెంగ్త్ జంటగా కనిపిస్తారు కాబట్టి ప్రేక్షకులకి కన్నుల పండగే.
This post was last modified on March 4, 2022 5:52 pm
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…