మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాక వ్యక్తిగా కూడా ఎంతోమందికి స్ఫూర్తి. మెగాస్టార్‌గా ఎదిగాక ఆయన 90వ దశకంలోనే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మొదలుపెట్టి లక్షల మందికి సాయపడ్డారు. చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం రావడానికి ఈ సేవ కూడా ఓ ముఖ్య కారణం. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల ఆయన ఇమేజ్ కొంత దెబ్బ తింది కానీ.. అంతకుముందు చిరు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ల విషయంలో అందుకున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు.
ఇది చూసి లక్షల మంది స్ఫూర్తి పొందారు. అందులో తాను కూడా ఒకడినని అంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. తమిళనాట సూర్య చేసే సేవా కార్యక్రమాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. అగరం పేరుతో ఫౌండేషన్ పెట్టి వేల మందికి ఉచిత విద్య, వసతి అందిస్తోంది సూర్య కుటుంబం. ఈ ఫౌండేషన్ కోసం తమ సొంత ఇంటినే విరాళంగా ఇచ్చేసిన గొప్పదనం వారిది. కొన్నేళ్లుగా చాలా సిన్సియర్‌గా ఈ ఫౌండేషన్ ద్వారా గొప్ప సేవ చేస్తోంది సూర్య ఫ్యామిలీ.
ఐతే ఈ ఫౌండేషన్ మొదలుపెట్టడానికి స్ఫూర్తి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు సూర్య. తన కొత్త చిత్రం ‘ఈటి’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన అతను.. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షల మందికి సేవ చేస్తూ ఎంతోమందిని ఇన్‌స్పైర్ చేయడం చూశానని.. అది చూసే తాము కూడా సమాజానికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో ఫౌండేషన్ మొదలుపెట్టామని చెప్పాడు.
చిరు చేసిందాట్లో 1-2 శాతం చేయగలిగినా చాలు అని తాము అనుకున్నామని.. కానీ ఇప్పుడు ఆ సంస్థ ద్వారా ఐదువేల మందికి పూర్తి విద్యను ఉచితంగా అందించామని తెలిపాడు సూర్య. ఈ మాట చెప్పినపుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది. సూర్య లాంటి పెద్ద హీరోకు చిరు ఇంతగా స్ఫూర్తినిచ్చాడా అంటూ చిరును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.
This post was last modified on March 4, 2022 4:37 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…