Movie News

హీరోను ఒంటరిగా కలవనందుకు తప్పించారట

ఇషా కొప్పికర్ గుర్తుందా? 90వ దశకం చివర్లో తెలుగులో అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో సరసన ‘చంద్రలేఖ’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందామె. ఆ తర్వాత ‘ప్రేమతో రా’, ‘కేశవ’ లాంటి చిత్రాల్లోనూ మెరిసింది ఇషా. హిందీలో ఆమె తొలి చిత్రం ‘ఏక్ థా దిల్ ఏక్ థా దడ్కన్’ మంచి విజయమే సాధించింది. ఐతే ఆమె కెరీర్ ఏ దశలోనూ అనుకున్నంతగా ఊపందుకోలేదు.

కథానాయికగా ఆమె కెరీర్ తక్కువ కాలమే సాగింది. అవకాశాలు లేక కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఇషా.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా షాకింగ్ కామెంట్స్ చేసింది.

తన కెరీర్ ఆరంభంలో తాను ఒక సినిమాకు సంతకం చేశానని.. కానీ ఆ చిత్ర హీరో తనను ఒంటరిగా కలవాలని చెప్పాడని.. అందుకు అంగీకరించనందుకు తనను ఆ చిత్రం నుంచి తప్పించారని ఆమె వెల్లడించింది.

తన కుటుంబంలో ఎక్కువగా డాక్టర్లే ఉన్నారని.. తాను అనుకోకుండా యాక్టర్ అయ్యానని.. కాలేజీ రోజుల్లో పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసిన తనకు అనుకోకుండా మంచి పేరొచ్చిందని, దాంతో పాటే సినిమా అవకాశాలు వచ్చాయని.. అలా కెరీర్ ఆరంభించిన తనకు ఒక నిర్మాత నుంచి కాల్ వచ్చిందని.. తాము నిర్మిస్తున్న సినిమాలో కథానాయికగా తీసుకుంటున్నట్లు చెప్పారని.. హీరోకు తాను తెగ నచ్చేశానని తెలిపారని ఇషా వెల్లడించింది.

ఐతే సదరు హీరోను ఏకాంతంగా కలవాలని ఆ నిర్మాత చెప్పారని.. అప్పటికి ఆయన మాటలు తనకు అర్థం కాలేదని.. తర్వాత హీరోకు కాల్ చేస్తే.. ‘‘ఒంటరిగా మీరొక్కరే నా దగ్గరకి రండి. మీ స్టాఫ్‌ను వెంట తీసుకురావద్దు’’ అని చెప్పారని.. అప్పుడు ఆయన ఉద్దేశం తనకు అర్థమైందని ఇషా చెప్పింది. వెంటనే నిర్మాతకు ఫోన్ చేసి తన టాలెంట్ ఆధారంగా ఆఫర్ వస్తేనే సినిమా చేస్తానని తేల్చి చెప్పేశానని.. తాను హీరోను కలవనందుకు ఆ ప్రాజెక్టు నుంచి తనను తీసేశారని ఆమె తెలిపింది.

This post was last modified on March 3, 2022 10:53 pm

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

17 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

1 hour ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

1 hour ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

2 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

3 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago