ఈ ఏడాది ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్‌లో అగ్ర స్థానం రాజమౌళి నుంచి రానున్న‘ఆర్ఆర్ఆర్’దైతే.. రెండో స్థానం యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ అనడంలో సందేహం లేదు. రెండేళ్ల కిందట వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’ వివిధ భాషల్లో ఎంత సంచలనం రేపిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ‘చాప్టర్-2’ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దాని అభిమానులు. ఐతే కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది.
2020లోనే రావాల్సి సినిమా 2022 వేసవికి వాయిదా పడిపోయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలన్నర లోపే సినిమా విడుదల కానుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల హడావుడి మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా త్వరలోనే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ‘కేజీఎఫ్-2’ ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం కూడా ఖరారైంది.
మార్చి 27న సాయంత్రం 6.40 గంటలకు ‘కేజీఎఫ్-2’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో ఒకేసారి లాంచ్ చేయబోతున్నారు. గత ఏడాది జనవరిలో యశ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ‘కేజీఎఫ్-2’ టీజర్ ఎంతటి ప్రకంపనలు రేపిందో తెలిసిందే. మాస్‌కు పూనకాలు తెప్పించే షాట్లతో వారెవా అనిపించింది టీజర్. ముఖ్యంగా మెషీన్ గన్నుతో వాహనాల్ని పేల్చేసి.. ఆ గన్ను మీద ఉన్న వేడితో యశ్ సిగరెట్ అంటించుకునే షాట్ అయితే మతులు పోగొట్టేసింది.
ఆ టీజర్ చూసినప్పటి నుంచి సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. టీజరే అలా ఉంటే ఇప్పుడిక ట్రైలర్ ఏ రేంజిలో ఉంటుందో.. ఇందులో ఇంకేం మెరుపులుంటాయో అని ఉత్కంఠ రేగుతోంది. మాస్ పల్స్ బాగా తెలిసిన ప్రశాంత్ నీల్.. ట్రైలర్‌తోనూ పూనకాలు తెప్పించడం ఖాయమనే భావించవచ్చు. హోంబలె ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రంలో విలన్ సంజయ్ దత్ నటించడం తెలిసిందే.
This post was last modified on March 3, 2022 2:00 pm
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలుపుతో భారత క్రికెట్ మళ్లీ చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ ప్రారంభానికి…
టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో 4 వికెట్ల తేడాతో…
టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని టీడీపీ అదినేత,…
టీమిండియా చరిత్రను తిరగరాసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్‌ను కైవసం…
పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…
తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…