Movie News

హర్టయ్యా.. కానీ అందుకు కాదు

కొత్త సినిమా రిలీజ్ టైంలో టీంలోని కీలక వ్యక్తులు మీడియాలో కనిపించకపోతే రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. టీంలోని ఇతర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు.. లేదంటే సినిమాలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలతో అలకలు చోటు చేసుకుంటూ ఉంటాయి. టాలీవుడ్ కొత్త రిలీజ్ ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇలాంటి విషయాలు చర్చకు వచ్చాయి. దర్శకుడు సాగర్ చంద్రను పక్కకు నెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో త్రివిక్రమ్ కొంత హర్టయ్యాడని, ప్రి రిలీజ్ ఈవెంట్లో అందుకే బ్యాక్ సీట్ తీసుకున్నారని వార్తలొచ్చాయి.

దానికి తర్వాత త్రివిక్రమ్ వివరణ ఇచ్చుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్యగా కీలక పాత్ర పోషించిన నిత్యా మీనన్.. తన క్యారెక్టర్‌కు తాను కోరుకున్నంత ప్రాధాన్యం దక్కకపోవడంతో హర్టయి ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. దీనిపై ఎవరూ ఏమీ స్పందించలేదు. మరోవైపు రానా దగ్గుబాటికి జోడీగా నటించిన సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది.

ఆమె కూడా తన పాత్ర విషయంలో అన్యాయం జరిగిందని ఫీలవుతోందని, షూట్ చేసిన చాలా సన్నివేశాలను ఫైనల్ కట్ సందర్భంగా పక్కన పెట్టేశారని హర్టయిందని మీడియాలో కొంతమేర ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ ప్రచారానికి సంయుక్త వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను హర్టయ్యానంటూ సోషల్ మీడియాలో కనిపించిన ఒక వార్త లింక్‌కు ఆమె తనదైన శైలిలో జవాబు చెప్పింది.

తాను ‘భీమ్లా నాయక్’ విషయంలో హర్టయిన మాట వాస్తవమని.. అది పాత్ర ప్రాధాన్యం దక్కినందుకు కాదని, ఈ సినిమాను రెండోసారి చూద్దామని ప్రయత్నిస్తే టికెట్లు దొరకనందుకని ఆమె పేర్కొంది. దీంతో ఈ ప్రచారానికి తెరపడిపోయింది. నిజానికి మలయాళంతో పోలిస్తే ఈ పాత్రకు తెలుగులో నిడివి, ప్రాధాన్యం పెంచారు. అదనపు సన్నివేశాలు జోడించారు. చివర్లో ఈ పాత్రతో ముడిపెట్టి ఒక కొత్త ట్విస్టు సినిమాకు మంచి ముగింపునిచ్చింది కూడా. కాబట్టి ఈ క్యారెక్టర్ విషయంలో సంయుక్త హర్టవడానికి ఆస్కారమే లేదు.

This post was last modified on March 3, 2022 9:27 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

2 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

3 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

6 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

6 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

7 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

7 hours ago