Movie News

నితిన్-వక్కంతం.. టైటిల్ ఫిక్స్?

యువ కథానాయకుడు నితిన్‌కు కొన్నేళ్లుగా కాలం కలిసి రావట్లేదు. ‘భీష్మ’ మినహాయిస్తే గత ఐదేళ్లలో అతడికి సరైన విజయం లేదు. ఈ చిత్రం కూడా అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజవడం వల్ల టాక్‌కు తగ్గ వసూళ్లేమీ రాబట్టలేదు. దాని తర్వాత చెక్, రంగ్ దె నిరాశ పరిచాయి. ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో రిలీజవడం వల్ల అది హిట్టా ఫెయిల్యూరా అని చెప్పలేం. దీని తర్వాత నితిన్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.

ముందు అనుకున్న వేరే చిత్రాలను పక్కన పెట్టి అతను ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ సగంలో ఉండగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న వక్కంతం వంశీ సినిమాను ఎట్టకేలకు నితిన్ ఓకే చేశాడు.

సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. తన రచనలో వచ్చిన ‘కిక్’ తరహాలో ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా స్క్రిప్టు రెడీ చేశాడట వంశీ. ‘కిక్’ అనే కాదు.. వంశీ రచయితగా పని చేసిన చాలా సినిమాలు వినోదాత్మకంగానే సాగుతాయి.

కానీ అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మాత్రం చాలా సీరియస్‌గా నడుస్తుంది. అది పెద్ద డిజాస్టర్ కావడంతో వంశీ దర్శకత్వ ప్రయాణానికి గట్టి దెబ్బ తగిలింది. దీంతో కొన్నేళ్లు లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఎట్టకేలకు నితిన్ అతడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. వంశీ.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’కు రచన చేసిన సంగతి తెలిసిందే.

This post was last modified on March 2, 2022 9:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago