ఓ యాక్టర్ టాలెంట్‌ని ఎలా వాడుకోవాలనేది దర్శకులు పసిగడితే చాలు.. అతని నుంచి బెస్ట్ రాబట్టుకోవచ్చు. కానీ ఆది పినిశెట్టి విషయంలో ఇలా జరగడం లేదేమో అనిపిస్తుంది అతని కెరీర్ గ్రాఫ్ చూస్తే. ఫేమస్ డైరెక్టర్‌కి కొడుకే అయినా నటుడిగా తన ముద్ర వేయాలని ఇండస్ట్రీకి వచ్చాడు ఆది. వైశాలి, మలుపు, గుండెల్లో గోదారి, యూటర్న్ లాంటి డిఫరెంట్ జానర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పటికీ అతనిని ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోవడం లేదనేది చాలామంది ఫీలింగ్. దానికి కారణం.. సరైనోడు సినిమా.
ఆదిలోని వెర్సటాలిటీని ఎవరైనా కరెక్ట్గా కనిపెట్టారు అంటే అది బోయపాటి శ్రీను అనే చెప్పాలి. ‘సరైనోడు’లో వైరం ధనుష్ పాత్రకి ఆదిని సెలెక్ట్ చేసుకోవడం ఓ గ్రేట్ మూవ్. కూల్, ఎమోషనల్, సిన్సియర్ రోల్స్ చేసిన హీరోని తీసుకొచ్చి.. పవర్‌ని అడ్డుపెట్టుకుని ఎంతకైనా తెగించే క్రూరమైన విలన్‌గా చూపించాడు బోయపాటి. పైగా క్లాస్ లుక్. చూడటానికి హీరోతో సమానంగా హ్యాండ్‌సమ్‌గా ఉంటాడు.
అదే సమయంలో హీరోకి దీటుగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. ఇలాంటి పాత్రలో చూసిన తర్వాత కూడా ఆదిని విలన్‌గా వాడుకోవాలనే ఆలోచన మన మేకర్స్‌కి రాకపోవడం ఆశ్చర్యమే. త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి’లో అలాంటి మరో పాత్రని ఇచ్చాడు కానీ దాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇతర పాత్రలతో మిక్స్ అయిపోయి తేలిపోవడంతో ఆ సినిమాలోని ఆది పాత్ర ప్రేక్షకుల మైండ్స్లో సరిగ్గా రిజిస్టర్ కాలేదు. కానీ ఇప్పుడు మరోసారి సరైనోడు రేంజ్ విలనీని పండించే అవకాశం ఆదికి వచ్చింది.. రామ్ సినిమా రూపంలో.
రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్‌లో ‘ద వారియర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు ఆది. శివరాత్రి సందర్భంగా అతని లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో టెరిఫిక్‌గా ఉన్నాడు అది. కళ్లలోనే కసి.. నిలబడిన విధానంలోనే యారొగెన్స్.. చాలా వయొలెంట్ విలన్‌లా కనిపిస్తున్నాడు. రామ్ చేస్తున్న పవర్‌ఫుల్ పోలీసు పాత్రకి గట్టి పోటీనే ఇస్తాడనిపిస్తోంది. తనని మరోసారి మంచి నెగిటివ్ రోల్‌లో చూడొచ్చనే ఫీల్ కలుగుతోంది.
This post was last modified on March 2, 2022 8:57 am
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…