టాలీవుడ్ హీరో రవితేజ వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తున్నారు. అలానే సినిమా, సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్నారు. టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా పారితోషికం పెంచుతున్న హీరో రవితేజ అనే చెప్పాలి. గత నాలుగేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో ‘క్రాక్’ తప్ప మరో హిట్టు లేదు. రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడి’ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది.
భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ప్రస్తుతం రవితేజ చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. ‘ఖిలాడి’ సినిమాకి ఆయన దాదాపు రూ.15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను పూర్తి చేశారు రవితేజ. ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సినిమాను కూడా పట్టాలెక్కించాడు.
‘ఖిలాడి’ షెడ్యూల్స్ మధ్యలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా కోసం రవితేజ రోజువారీ రెమ్యునరేషన్ తీసుకున్నారట. ఒక్కో రోజుకి రూ.50 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తామని రవితేజతో డీల్ మాట్లాడుకున్నారట. సినిమాను ఇరవై, పాతిక రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ వేసుకొని రెమ్యునరేషన్ రోజువారీ చొప్పున మాట్లాడుకున్నారు.
కానీ తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లాక షూటింగ్ రోజులు పెరిగిపోయాయి. ఇప్పటివరకు 33 రోజుల పాటు షూటింగ్ జరిగిందట. మరో రెండు, మూడు రోజుల ప్యాచ్ వర్క్ బాకీ ఉందట. ఎలా లేదన్నా ఈ సినిమాతో రవితేజకి రూ.17 నుంచి రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుతుందని చెబుతున్నారు. పాపం రెమ్యునరేషన్ తగ్గించుకుందామని నిర్మాతలు ప్లాన్ చేస్తే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.
This post was last modified on March 1, 2022 9:27 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…