ఒకప్పుడు హిందీ చిత్రాల మార్కెట్ ముందు తెలుగు చిత్రాలు చాలా చిన్నవిగా కనిపించేవి. ఎందుకంటే హిందీ సినిమాలకు దేశవ్యాప్త మార్కెట్ ఉంటే.. తెలుగు చిత్రాల పరిధి ఒక రాష్ట్రం వరకే ఉండేది. అందుకే హిందీ చిత్రాల వసూళ్ల ముందు మన సినిమాల కలెక్షన్లు చాలా తక్కువగా కనిపించేవి. కానీ గత కొన్నేళ్లలో మన సినిమాల మార్కెట్ పరిధి బాగా విస్తరించింది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెరగడమే కాక.. వేరే రాష్ట్రాలు, దేశాల్లో కూడా మన చిత్రాల హవా మామూలుగా ఉండట్లేదు. పాన్ ఇండియా స్థాయిలో మన చిత్రాలకు భారీ వసూళ్లు వస్తుండటంతో ఇప్పుడు టాలీవుడ్ ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఈ వీకెండ్లో ‘గంగూబాయి కతియవాడీ’ అనే పెద్ద హిందీ సినిమా రిలీజైంది. ఆలియా భట్, సంజయ్ లీలా బన్సాలీల క్రేజీ కాంబినేషన్లో, మంచి అంచనాల మధ్య వచ్చిన చిత్రమిది.
‘గంగూబాయి’కి మంచి టాక్ కూడా వచ్చింది. అయినా సరే.. వసూళ్ల విషయంలో ప్రాంతీయ చిత్రమైన ‘భీమ్లా నాయక్’ ముందు ఆ సినిమా ఏమాత్రం నిలవలేకపోయింది. ఒక్క నైజాం ఏరియాలో ‘భీమ్లా నాయక్’ తొలి రోజు 11.8 కోట్ల షేర్ సాధించడం విశేషం. ఐతే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో సాధించిన నెట్ వసూళ్లు 10.5 కోట్లు మాత్రమే కావడం విశేషం. ‘భీమ్లా నాయక్’ ఓవరాల్ షేర్ రూ.22 కోట్లకు అటుగా ఉంది.
ఏపీలో టికెట్ల రేట్లు మరీ తక్కువ ఉండటం వల్ల ‘భీమ్లా నాయక్’ డే-1 వరల్డ్ వైడ్ షేర్ తగ్గింది కానీ.. లేదంటే 30 కోట్ల మార్కుకు చేరువగా ఉండేది. అప్పుడు ఈ సినిమా ముందు ‘గంగూబాయి’ మరింత వెలవెలబోయేది. అయినా కూడా ఒక్క తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ సాధించిన వసూళ్ల కంటే ‘గంగూబాయి’ ఇండియా మొత్తంలో రాబట్టిన కలెక్షన్లు తక్కువగా ఉండటం మన సినిమా హవాకు నిదర్శనం. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల ముందు హిందీ చిత్రాలు చాలానే వెలవెలబోయాయి. ముఖ్యంగా కొవిడ్ మొదలైనప్పటి నుంచి హిందీ చిత్రాల వసూళ్లు మరింతగా పడిపోయాయి.
This post was last modified on February 27, 2022 6:14 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…