Movie News

200 కోట్ల క్లబ్బులో రామ్

జియో పుణ్యమా అని మొబైల్ ఇంటర్నెట్ చాలా చౌకగా మారిపోయింది దేశంలో. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో సినిమాలు, కామెడీ స్కిట్లు, ఇతర వీడియోలన్నింటికీ కూడా అమాంతం వ్యూయర్ షిప్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు నుంచి హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసిన ప్రతి సినిమాకూ ఉత్తరాదిన కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఇలా నార్త్ ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించిన టాలీవుడ్ యువ కథానాయకుల్లో రామ్ ఒకడు. అతడి సినిమాలు పాతవి ఇప్పుడు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నా భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్‌లో పెట్టిన తన సినిమాలన్నింటితో కలిపి రామ్ ఏకంగా 200 కోట్ల వ్యూస్ సాధించడం విశేషం. అతను తాజాగా 2 బిలియన్ క్లబ్బులో చేరిన నేపథ్యంలో తన చిత్రాల వ్యూస్‌కు సంబంధించి పీఆర్వో టీం బ్రేకప్స్‌తో వివరాలు వెల్లడించింది.

రామ్ కెరీర్లోనే అత్యధికంగా నేను శైలజ చిత్రానికి యూట్యూబ్‌లో ఏకంగా 44 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది హలో గురూ ప్రేమకోసమే. ఈ చిత్రం 40.4 కోట్ల వ్యూస్ సాధించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్నది ఒకటే జిందగీ. ఆ సినిమాకు 31.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పటిదాక 25 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టింది. రామ్ మరో సినిమా హైపర్ యూట్యూబ్‌లో 17 కోట్ల వ్యూస్ సాధించింది. మిగిలిన రామ్ సినిమాలకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. ఇలా మొత్తం కలిపితే వ్యూస్ 2 బిలియన్ మార్కును దాటిపోయాయి.

దక్షిణాదిన తన సినిమాల వ్యూస్‌తో 2 బిలియన్ మార్కును అందుకున్న తొలి కథానాయకుడు రామే అంటూ పీఆర్వో టీం చెబుతోంది. రామ్ అనే కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరో సినిమాలకు కూడా నార్త్‌లో ఇలాగే భారీ వ్యూస్ వస్తుండటం విశేషం.

This post was last modified on February 26, 2022 3:21 pm

Share
Show comments
Published by
Satya
Tags: Youtube

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

11 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

12 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago