ఆర్ఎక్స్ 100 సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు కార్తికేయ. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అత్యధిక ప్రయోజనం పొంది, ఎక్కువ అవకాశాలు అందుకున్నది అతనే. ఆ సినిమా 2018లో రిలీజైతే.. మూడేళ్లు తిరక్కుండానే అరడజను సినిమాలు లాగించేశాడతను. కానీ ఏదీ కూడా అతడికి ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అతను బాగానే కష్టపడుతున్నా.. తన పెర్ఫామెన్స్‌కు మంచి మార్కులే పడుతున్నా సినిమాలు మాత్రం విజయవంతం కావడం లేదు.
విలన్ పాత్రలో మెరిసిన గ్యాంగ్ లీడర్ సైతం నిరాశకే గురి చేసింది. ఐతే ఇప్పుడు తమిళంలో చాలా పెద్ద స్టార్ అయిన అజిత్ నటించిన వలిమై చిత్రంలో అతను ప్రధాన విలన్ పాత్ర పోషించాడు. దీనిపై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ముందు నుంచి గొప్పగా చెబుతూ వచ్చాడు కార్తికేయ.
కానీ చివరికి సినిమా చూసిన తెలుగు ప్రేక్షకులంతా నిట్టూరుస్తున్నారు. ఈ సినిమా గురించా కార్తికేయ ఇంత ఎగ్జైట్ అయ్యాడు అంటున్నారు. మన తెలుగులో ఇలాంటి సినిమాలు, అలాంటి పాత్రలు చాలానే చూశాం. మన వాళ్లకు ఏమంత ఎగ్జైట్మెంట్ ఇవ్వట్లేదీ సినిమా. ఐతే ఈ చిత్రంలో కార్తికేయ తన వంతుగా బాగా కష్టపడ్డాడన్నది మాత్రం వాస్తవం. అతడికి మామూలుగానే తన బాడీ పెద్ద ప్లస్. ఈ చిత్రం కోసం మరింతగా ఫిజిక్ పెంచాడు.
ప్రతి సన్నివేశంలోనూ తన ఫిజిక్‌తో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. పాత్ర వీక్ అయినప్పటికీ.. దాన్ని నిలబెట్టడానికి కార్తికేయ బాగానే కష్టపడ్డాడు. తమిళ ప్రేక్షకులు ఒప్పుకోరు కానీ.. చాలా చోట్ల కార్తికేయ ముందు అజిత్ తేలిపోయాడు. ఫిజిక్, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా కార్తికేయదే డామినేషన్. కానీ ఇంత కష్టపడ్డప్పటికీ.. అతడి పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయింది. ఇందులో తప్పంతా దర్శకుడితే అనడంలో సందేహం లేదు.
This post was last modified on February 25, 2022 7:13 am
జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చాలా విషయాలను ప్రస్తావించారు. కొన్ని…
మూడు వారాలు ఆలస్యంగా విడుదలైనా మంచి వసూళ్లతో తెలుగు వెర్షన్ బోణీ మొదలుపెట్టిన ఛావాకు వసూళ్లు బాగానే నమోదవుతున్నా ఏదో…
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
జనసేన ఆవిర్భావ వేడుకల్లో సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆ పార్టీ అదినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… తనను…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…