Movie News

సినిమాలు ఇంకిపోయి… ఇంకుని నమ్ముకుంది!

నిత్యా మీనన్ టాలెంటెడ్ నటి అనే దాంట్లో అనుమానాలు లేవు కానీ ఆమె అన్ని తరహా సినిమాలకు సరిపోదు. అలాగే అందరు హీరోల సరసన సూట్ కాదు. అందుకే రావాల్సినన్ని సినిమాలు రాలేదు. బహు భాషా నటి కనుక ఇంత కాలం అవకాశాలు అందిపుచ్చుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడిక అవకాశాలు తగ్గిపోయాయి. ఎలాగో లాక్ డౌన్ రావడంతో ఈ ఖాళీ టైంని నిత్య మరో పనికి వాడుకుంటోంది.

ఎప్పటినుంచో తనలో ఉన్న ఆలోచనలను పేపర్ పై పెడుతోంది. దర్శకత్వం చేయాలనేది నిత్యా మీనన్ కు ఎప్పట్నుంచో ఉన్న ఆలోచన. కథలు సిద్ధమైన తర్వాత ఆ ప్రయత్నాలు మొదలు పెట్టనుంది. నిత్యా మీనన్ డైరెక్టర్ అంటే మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా డిమాండ్ ఉంటుంది.

అలాగే ఇప్పుడు ఫండ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కూడా ఉన్నాయి. కాబట్టి డైరెక్టర్ గా డెబ్యూ నిత్యాకు కష్టం కాబోదు. సక్సెస్ అయితే ఎలాగో వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. ఆల్ ది బెస్ట్ నిత్యా!

This post was last modified on June 17, 2020 2:22 am

Share
Show comments
Published by
suman
Tags: Nitya Menon

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

7 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

43 minutes ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

3 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

9 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago