ఒక హీరో సినిమాలో మరో హీరో విలన్‌గా నటిస్తే వచ్చే కిక్కే వేరు. అందులోనూ వాళ్లిద్దరూ స్టార్స్ అయితే ఇక అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ‘బాహుబలి’లో ప్రభాస్‌కి ప్రత్యర్థిగా రానాని చూసి విజిల్స్ వేయని వాళ్లెవరైనా ఉంటారా! ఇప్పుడు అలాంటి మ్యాజిక్ ఒకటి మళ్లీ జరగబోతోంది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అది కూడా మహేష్ బాబు సినిమా విషయంలో.
త్వరలో ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మహేష్. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో, దాని తర్వాత రాజమౌళితో సినిమాలు చేయాల్సి ఉంది. త్రివిక్రమ్‌తో సినిమా వచ్చే నెల మొదటి వారంలో సెట్స్‌కి వెళ్లబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. శోభన ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.
ఇక పోతే ఈ మూవీ విలన్ విషయంలో ఓ ఇంటరెస్టింగ్ బజ్ నడుస్తోంది. ఇందులో మహేష్‌తో తలపడే విలన్ చాలా స్పెషల్‌గా ఉంటాడట. హీరోకి దీటుగా కనిపిస్తాడట. హోరాహోరీగా పోరాడాల్సి కూడా ఉంటుందట. మరోవైపు ఇంటెలిజెంట్ ప్లేని కూడా పర్‌ఫార్మ్ చేయాలట. అందుకే అతను కూడా ఓ హీరోనే అయ్యుండాలని, అందులోనూ ఓ వెర్సటైల్ యాక్టర్ అయ్యుండాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడట. ఆల్రెడీ తమిళ స్టార్ విక్రమ్‌ని అప్రోచ్ అయ్యాడని, ఆయన కూడా ఓకే అన్నాడని వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఈ న్యూస్ కొద్ది నెలల క్రితం కూడా వినిపించింది. అయితే అప్పుడు రాజమౌళి సినిమా కోసం విక్రమ్‌ని సంప్రదించారంటూ గుసగుసలు వినిపించాయి. అది ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే అడ్వెంచరస్ మూవీ కనుక విక్రమ్ లాంటి ఫిజిక్ ఉన్న విలన్ కోసం అడిగి ఉంటారు అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అదే విక్రమ్ పేరు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ విషయంలో తెరపైకి రావడంతో కన్‌ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ వార్తలో ఎంత నిజముంది? ఒకవేళ ఇది నిజమే అయితే తను నటించేది రాజమౌళి సినిమాలోనా లేక త్రివిక్రమ్ సినిమాలోనా? ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.
This post was last modified on February 23, 2022 10:04 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…