ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, నార్నే శ్రీనివాసరావు కుమారుడు.. నితిన్ చంద్ర ఇప్పుడు హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నిజానికి దర్శకుడు తేజ సినిమాతో నితిన్ చంద్ర నటుడిగా ఎంట్రీ ఇవ్వాల్సింది కానీ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తరువాత దర్శకుడు సతీష్ వేగ్నేశను రంగంలోకి దించారు. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు సతీష్ వేగ్నేశకి మంచి అనుభవం ఉంది.
ఇప్పుడు నితిన్ చంద్ర హీరోగా ఆయన తెరకెక్కిస్తోన్న సినిమా కూడా ఓ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘తీవండి’ అనే సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. టోవినో థామస్ నటించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. హిట్ కథ కావడంతో నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారు.
ఇప్పుడు దీనికి ‘శ్రీ శ్రీ రాజావారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అయితే కథకు యాప్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. మలయాళం సినిమా ఆధారంగా తీస్తున్నప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాను నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాసరావు స్వయంగా నిర్మించారు. దర్శకుడు సతీష్ వేగ్నేశ రూపొందించిన ‘శతమానం భవతి’ నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on February 23, 2022 3:39 pm
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…