రామాయణం మీద ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద చాలా సినిమాలొచ్చాయి. అయినా ఆ పురాణ గాథ మీద సినిమాలేమీ ఆగిపోలేదు. ఇప్పటిదాకా వచ్చిన అన్ని సినిమాలనూ తలదన్నేలా మన ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ పేరుతో రామాయణ గాథను కొత్త కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.
అసలీ సినిమా ఎలా మొదలైందో అతను వివరించాడు. జపనీస్ డైరెక్టర్ యుగో సాకో.. రామాయణం స్ఫూర్తితో తీసిన ఓ సినిమా చూస్తుండగా.. ఒక విదేశీయుడు మన పురాణ గాథ మీద ఇంత ఆసక్తికర చిత్రం తీసినపుడు, మనం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనతో తాను.. రామాయణానికి కొత్త వెర్షన్ రాయడం మొదలు పెట్టినట్లు రౌత్ వెల్లడించాడు.
ఈ కథ రాస్తున్నపుడు రాముడిగా ప్రభాస్ తప్ప వేరొకరిని తాను ఊహించుకోలేదని.. స్క్రిప్టు పూర్తయ్యాక ప్రభాస్‌కు ఫోన్లో కథ చెప్పడం మొదలుపెట్టానని.. మూడు సీన్లు చెప్పగానే, నేరుగా వచ్చి కలిసి కథ వింటానని చెప్పాడని రౌత్ తెలిపాడు. కథ విన్న వెంటనే సినిమాకు ఓకే చెప్పాడని.. అతడిలా ఈ సినిమాను తన భుజస్కందాలపై ఇంకెవ్వరూ మోయలేరని కితాబిచ్చాడు రౌత్.
ఈ సినిమా బడ్జెట్ రూ.400 కోట్లని వెల్లడించిన రౌత్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తామని.. బేసిగ్గా హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కిందని.. తమిళం, మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో అనువాదం చేస్తున్నామని.. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో భారీగా ఈ చిత్రం విడుదలవుతుందని రౌత్ తెలిపాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు రామ్ కాదని.. రాఘవ్ అని, అది రాముడికున్న మరో పేరు కావడంతో అలా పెట్టామని రౌత్ వెల్లడించాడు.
This post was last modified on February 23, 2022 8:04 am
రాజకీయ సన్యాసం అంటూ తెలుగు రాజకీయాల్లో పెను సంచలనం రేపిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… రోజుకో రీతిన వ్యవహరిస్తూ…
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఒకడిగా ఉదిత్ నారాయణ పేరు చెప్పొచ్చు. ఆయన దక్షిణాది సంగీత…
ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్…
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…