ఆలియా భట్ టైటిల్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయ్ కథియావాడి’. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో.. విడుదలను ఆపడానికి అంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కారణం.. గంగూబాయ్ జీవితమే. గంగూబాయ్ ఒక సెక్స్ వర్కర్ అనేది ముంబైలోని ఏ మూలకి వెళ్లి అడిగినా చెబుతారని ఆమె గురించి ఆర్టికల్స్, బుక్స్ రాసినవాళ్లంతా చెబుతున్నారు. భన్సాలీ కూడా హుస్సేజ్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ అనే పుస్తకంలోని ఓ చాప్టర్ ఆధారంగానే ఈ సినిమా తీశాడు. అయితే అసలు గంగూబాయ్ సెక్స్ వర్కరే కాదంటూ వివాదం మొదలైంది.
తన తల్లి సెక్స్ వర్కర్ కాదని, ఆమె చరిత్రని వక్రీకరిస్తున్నారని గంగూబాయ్ కొడుకు చాన్నాళ్ల క్రితమే కేసు వేశాడు. స్టే ఇవ్వమని కోర్టును కోరాడు. కానీ అతని పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది. దాంతో సినిమా పూర్తయ్యి విడుదలకు సిద్ధమయ్యింది. అయితే ట్రైలర్ రిలీజయ్యాక మరోసారి గంగూబాయ్ కొడుకు ఆవేదన చెందాడు. తన తల్లిని అలా చూపించడం తట్టుకోలేకపోతున్నానంటూ గొడవ చేస్తున్నాడు. కాకపోతే ఈసారి అతనితో పాటు కామాఠిపుర వాసులు కూడా తిరగబడటం ఎవరూ ఊహించనిది.
ట్రైలర్ వల్ల కామాఠిపుర ప్రతిష్ట దెబ్బ తిన్నదని, ఆ ప్రాంతం మొత్తాన్నీ జనం రెడ్‌లైట్ ఏరియాగా భావిస్తున్నారని, ఇది తమకు చాలా పెద్ద అవమానమని యాభైమందికి పైగా స్థానిక మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్లందరి తరఫున ఒకామె కేసు కూడా రిజిస్టర్ చేసింది. సినిమాలో కామాఠిపుర అన్న పేరే వినిపించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌తో పాటు పునరుజ్జీవన్ సేవా మండల్, అఖిల పద్మశాలి సమాజ్, గుజరాతీ ట్రస్ట్, తిరంగ్ హౌసింగ్ సొసైటీ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు కూడా గంగూబాయ్‌కి ఎదురు తిరిగాయి. ఆ సినిమాని వ్యతిరేకించడమే కాక రిలీజ్ ఆపి తీరాలని కోరుతున్నాయి. ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తున్నాయి.
సరిగ్గా విడుదలకు మూడు రోజుల ముందు ఈ రచ్చ మొదలవడం అందరినీ కంగారు పెడుతోంది. అయితే భన్సాలీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. రియాలిటీకి దగ్గరగా తీయడం వల్ల అతని ప్రతి సినిమా కాంట్రవర్శీల్లో చిక్కుకుంటుంది. ఎన్నో అష్టకష్టాలు పడ్డాకే థియేటర్లకి వస్తుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. మరి ఈసారి కూడా అతడు గంగూబాయ్‌ని సేఫ్‌గా ఒడ్డున పడేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on February 23, 2022 7:42 am
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…