‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆ స్థాయిలో అమితాసక్తితో ఎదురు చూస్తున్న సీక్వెల్ ‘కేజీఎఫ్: చాప్టర్-2’. రెండేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ‘కేజీఎఫ్’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరోయిజాన్ని పీక్స్‌లో చూపిస్తూ.. ఎలివేషన్లు, మాస్ అనే పదాల్ని రీడిఫైన్ చేస్తూ ప్రశాంత్ నీల్-యశ్ కలిసి చేసిన ప్రయత్నానికి దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ సినిమా రిలీజైన దగ్గర్నుంచి ‘చాప్టర్-2’ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కానీ 2020లోనే రావాల్సిన ఈ చిత్రం కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పట్టి 2022 వేసవికి షెడ్యూల్ అయింది. కానీ మేకర్స్ ప్రకటించిన ఏప్రిల్ 14న అయినా ఆ చిత్రం వస్తుందా రాదా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. అభిమానుల్లో పూర్తి నమ్మకం అయితే లేదు.ఐతే తాజాగా ‘కేజీఎఫ్-2’ నిర్మాతలు దీని రిలీజ్ డేట్‌ను ధ్రువీకరించారు.
తాజాగా ఒక ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తమ చిత్రం చెప్పినట్లే ఏప్రిల్ 14న రాబోతోందని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం తగ్గి పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తున్న నేపథ్యంలో ‘కేజీఎఫ్-2’ రిలీజ్ విషయంలో ఇక సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదనే చెప్పొచ్చు. ఏప్రిల్ 14కు షెడ్యూల్ అయిన భారీ బాలీవుడ్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ కూడా వాయిదా పడిపోవడంతో ‘కేజీఎఫ్-2’ పాన్ ఇండియా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్లే. కాకపోతే తమిళ చిత్రం ‘బీస్ట్’తోనే దానికి కొంచెం ఇబ్బంది ఉంది.
ఈ విజయ్ సినిమాపై తమిళంలో భారీ అంచనాలున్నాయి. దాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఈ క్లాష్‌తో కొంచెం సమస్య ఉంది. ఐతే ‘కేజీఎఫ్-2’పై ఉన్న అంచనాల దృష్ట్యా ‘బీస్ట్’ మూవీనే రిలీజ్ డేట్ మార్చుకుంటే మంచిదేమో. దాని మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తారా.. లేక సై అంటే సై అంటారా అన్నదే చూడాలి.
This post was last modified on February 22, 2022 2:29 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…