టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నాలు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ `గీత గోవిందం` మూవీలో తొలిసారి జంటగా నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఈ మూవీలో విజయ్, రష్మికల కెమెస్ట్రీ మరింత అద్భుతంగా పండింది.
రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఏమాత్రం మొహమాటం లేకుండా నటించి ఆన్ స్క్రీన్‌పై సూపర్ హిట్ జోడీగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` చిత్రం చేశారు. అప్పటి నుంచీ విజయ్, రష్మికలు ప్రేమలో పడ్డారంటూ వార్తలు మొదలయ్యాయి. పైగా వీరిద్దరూ కలిసి తరచూ పార్టీలకు హాజరు అవ్వడం, డిన్నర్లకు వెళ్లడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.
దీంతో ఎక్కడికి వెళ్లినా మీ ఇద్దరి పెళ్లెప్పుడు..? అనే ప్రశ్న రష్మిక, విజయ్‌లకు ఎదురవుతూనే ఉంటుంది. కానీ, తాము ఫ్రెండ్స్ మాత్రమే అని.. ప్రేమ, పెళ్లి వంటి ఆలోచనలే మాలో లేవని వీరిద్దరూ ఎన్నో సార్లు కండబద్దలు కొట్టారు. అయినా వీరిపై రూమర్స్ ఆగడం లేదు. తాజాగా బాలీవుడ్ మీడియా ఈ ఏడాదే రష్మికను విజయ్ వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు రాసేసింది.
అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. విజయ్ ట్విట్టర్ వేదికగా మీడియాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ప్రతిసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విజయ్.. తన ట్వీట్‌లో బూతులను కూడా వాడేశాడు. దాంతో రష్మిక, విజయ్‌ల పెళ్లి వార్త ఫేక్ అని తేలిపోయింది. మరి ఇప్పటికైనా వీరిద్దరిపై అనవసరమైన రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి.
This post was last modified on February 22, 2022 10:17 am
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…