రీసెంట్‌గా గెహ్‌రాయియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది దీపికా పదుకొనె. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఫస్టు లుక్ రిలీజైన నాటి నుంచి రిలీజ్ వరకు పెద్ద దుమారమే రేగింది. టూ పీస్ బికినీలో కనిపించడం దగ్గర్నుంచి ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం వరకు దీపిక పాత్ర విషయంలో చాలా నెగిటివిటీ వచ్చింది. అయితే ఆమె మాత్రం ఎవరి కామెంట్స్‌నీ సీరియస్‌గా తీసుకోలేదు. అది తన పనిలో భాగమంటూ కొట్టిపారేసింది.
ఆరేళ్లుగా తనతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తిని మోసగించి, తన కజిన్ ఫియాన్సీతో సంబంధం పెట్టుకునే అమ్మాయిగా ఇందులో నటించింది దీపిక. దాంతో రీసెంట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి ఆమెకి. నిజ జీవితంలో ఇలాంటి వాటి విషయంలో మీరెలా రియాక్టవుతారు అని అడగడంతో కాస్త డీప్‌గానే వెళ్లి మాట్లాడింది దీపిక. ‘ఎదుటివాళ్ల రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. చీటింగ్ జరిగితే వాళ్లు క్షమించి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది వాళ్ల ఇష్టం. కానీ నా విషయానికి వస్తే నేను మోసాన్ని సహించలేను. చీట్ చేస్తే తట్టుకోలేను. బంధం అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది.
అది లేకపోతే అసలు రిలేషన్‌కి అర్థమే లేదు’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది దీపిక. అంతేకాదు.. ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువకాలం ఉండదని, ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం, నమ్మకమే రిలేషన్‌ని నిలబెడతాయని చెప్పింది. దీపిక ఇంత స్ట్రాంగ్‌గా మాట్లాడటానికి కారణం ఉంది.
గతంలో రిలేషన్స్ విషయంలో మోసపోయిందామె. ఆ విషయం తనే ఓపెన్‌గా చెప్పింది. ఆమె ప్రేమించినవాడు నమ్మకద్రోహం చేసినా క్షమించి మరో చాన్స్ ఇచ్చిందట. కానీ అతను మళ్లీ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆమె మనసు విరిగిపోయిందట. అందుకే రణ్‌వీర్ ప్రపోజ్ చేస్తే కూడా ఎస్ చెప్పడానికి భయపడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అలాంటి దీపిక ఇలా ఓ మోసకత్తె పాత్రలో నటించడం విచిత్రమే మరి.
This post was last modified on February 22, 2022 7:44 am
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…