నందమూరి బాలకృష్ణ సినిమాలకి మొట్టమొదట ప్లస్ అయ్యేది ఆయన టైటిల్స్ అని చెప్పొచ్చు. ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉండే టైటిల్స్ అంచనాలను పెంచేస్తుంటాయి. అందుకే కొత్త సినిమా అనౌన్స్ చేసిన ప్రతిసారీ ఏ టైటిల్ పెట్టబోతోన్నారోనని ఆసక్తిగా చూస్తుంటారు అభిమానులు. అందుకు తగ్గట్టే డైరెక్టర్లు కూడా పవర్‌ఫుల్ టైటిల్స్ని సెలెక్ట్ చేస్తుంటారు. గోపీచంద్ మలినేని కూడా ఓ మంచి టైటిల్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
రీసెంట్‌గా ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య, ఆ వెంటనే గోపీచంద్ మూవీ షూటింగ్‌లో జాయినైపోయారు. ప్రస్తుతం సిరిసిల్లలోని ఓ క్వారీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్, లక్ష్మణ్‌లు కంపోజ్ చేసిన ఫైట్స్‌ని తెరకెక్కిస్తున్నారు. లొకేషన్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ కావడంతో బాలయ్య లుక్ బైటికొచ్చేసింది. దాంతో ఇక సస్పెన్స్ మెయింటెయిన్ చేయడం అనవసరమని ఫీలైన మేకర్స్ ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేసేశారు.
అలాగే ఓ మంచి టైటిల్‌ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారట. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును ఖరారు చేశారని టాక్. ఇది వినగానే సమరసింహారెడ్డి పేరు గుర్తు రావడం ఖాయం. బాలయ్య స్టార్‌డమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ఆ సినిమా టైటిల్‌ని పోలి ఉన్న ఈ టైటిల్ కూడా క్లిక్ అవుతుందనే అనిపిస్తోంది.
పైగా సినిమాలోని క్యారెక్టర్‌ని టైటిల్‌గా పెట్టిన ప్రతిసారీ బాలయ్యకి కలిసొస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, అఖండ అంటూ మంచి మంచి హిట్లు కొట్టారాయన. కాబట్టి ఈ రకంగానూ ఇది మంచి టైటిలేనని చెప్పొచ్చు. నిజానికి మొన్నటి వరకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పేరు బైటికొచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్. కన్నడ హీరో ‘దునియా’ విజయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
This post was last modified on February 21, 2022 11:37 pm
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…